Begin typing your search above and press return to search.

'మంచి రోజులు వచ్చాయి' పాట బాగా ఎక్కేసింది..!

By:  Tupaki Desk   |   23 Sep 2021 10:29 AM GMT
మంచి రోజులు వచ్చాయి పాట బాగా ఎక్కేసింది..!
X
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ సింగిల్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎక్కేసిందే' అనే మరో పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది

ఇప్పటికే వదిలిన 'ఎక్కేసిందే' సాంగ్ ప్రోమో వీక్షకులను అలరించింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన పూర్తి పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. ''ఆ.. ఎక్కేసింది.. ఎక్కేసింది.. గుండె మబ్బుల్లోకే.. వచ్చేసింది.. వచ్చేసింది.. వచ్చేసింది లైఫు మళ్ళీ నాకే..'' అంటూ సాగిన ఈ సాంగ్ కు అనూప్ రూబెన్స్ ట్యూన్ సమకూర్చారు. దీనికి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ మధ్య తనదైన పెప్పీ వాయిస్ తో సాంగ్స్ ని చార్ట్ బస్టర్స్ చేస్తున్న చౌరస్తా రామ్ మిరియాల ఈ పాట పాడారు.

''ఎక్కేసిందే'' సాంగ్ కు యష్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇందులో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ జంట వేసిన హుషారైన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. షూటింగ్ అప్పుడు అల్లు శిరీష్ - సాయి తేజ్ వంటి హీరోలు లొకేషన్ కు వచ్చినట్లు లిరికల్ వీడియోలో కనిపిస్తోంది.

'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ మరియు SKN లు నిర్మాతలు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మారుతి గత చిత్రాల తరహాలోనే భారీ తారాగణంతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.