Begin typing your search above and press return to search.

'ఏక్‌ థా టైగర్‌' ఓ రియల్ హీరో స్టోరీ

By:  Tupaki Desk   |   12 March 2021 6:30 AM GMT
ఏక్‌ థా టైగర్‌ ఓ రియల్ హీరో స్టోరీ
X
సల్మాన్ ఖాన్ హీరోగా 2012 సంవత్సరంలో వచ్చిన ఏక్‌ థా టైగర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో సల్మాన్ ఖాన్ పోషించిన పాత్ర ఒక రియల్‌ హీరో కథను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నది అనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ రియల్‌ హీరో పేరు టైగర్ రవీంద్ర కౌశిక్‌. 1952 లో రాజస్థాన్ లోని శ్రీగంగ నగర్ లో జన్మించిన ఆయన 23 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ లోకి అండర్ కవర్ 'రా' ఏజెంట్‌ గా వెళ్లాడు. అక్కడ ఆర్మీలో జాయిన్ అయిన కౌశిక్ భారత్ కు కీలక సమాచారాన్ని చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. సుదీర్ఘ కాలం పాటు అక్కడే ఉండి చివరకు అక్కడే మృతి చేందారు.

1975 లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కౌశిక్ రా ఏజెన్సీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఆయనకు పాకిస్తాన్ వెళ్లేందుకు శిక్షణ ఇచ్చారు. రెండేళ్ల పాటు ముస్లీం యువకుడిగా మారేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఉద్దూ మరియు పంజాబీ భాషలు నేర్పించడంతో పాటు ముస్లీం మతానికి సంబంధించిన విషయాలను కూడా నేర్పించారు. అలా పాకిస్తాన్‌ లో అడుగు పెట్టిన కౌశిక్ కు నబీ అహ్మద్ షకీర్ పేరు పెట్టారు. పౌర గుమస్తాగా పాక్ సైన్యంలో చేరారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ ఖాతాల విభాగానికి బదిలీ చేశారు. అక్కడి పాక్ అధికారి కూతురుతో కౌశిక్ వివాహం జరిగింది.

1983లో కౌశిక్ భారత రా ఏజెంట్‌ అనే విషయం పాకిస్తాన్‌ కు తెలియడంతో జైల్లో వేశారు. 1985 లో ఆయనకు పాక్ కోర్టు ఉరి శిక్ష వేయగా పాక్‌ సుప్రీమ్‌ కోర్టు ఆ ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 16 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన కౌశిక్‌ తీవ్ర అనారోగ్య కారణాలతో మృతి చెందారు. 2012 - 13 మద్య అతడు మరణించి ఉంటాడని ఆర్మీ పేర్కొంది. ఆ రియల్ హీరో కథతో వచ్చిందే ఏక్‌ థా టైగర్ సినిమా.