Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   16 April 2021 1:24 PM GMT
ఏక్ మినీ కథ రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించింది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. మ్యాంగో మాస్ మీడియా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ - మినీ టీజర్ - పాటలతో సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించారు.

'ఏక్ మినీ కథ' చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా వదిలిన కొత్త పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.  వాస్తవానికి ఏప్రిల్ 30న దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ డేట్ ని ఇప్పుడు 'ఏక్ మినీ కథ' కోసం లాక్ చేసుకున్నారు. ఈ నెల చివర్లో సోలో రిలీజ్ కావడం.. ఆ సమయంలో వేరే సినిమాల విడుదల లేకపోవడం ఈ చిత్రానికి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ - సుదర్శన్ - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.