Begin typing your search above and press return to search.

డస్ సైజ్ మేటర్: 'ఏక్ మినీ కథ' పెయిర్ ఫన్నీ ఇంటర్వ్యూ!

By:  Tupaki Desk   |   31 March 2021 4:38 PM GMT
డస్ సైజ్ మేటర్: ఏక్ మినీ కథ పెయిర్ ఫన్నీ ఇంటర్వ్యూ!
X
టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ వారు ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు యూవి కాన్సెప్ట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను రూపొందిస్తుంది. ఈ బ్యానర్ లో ఫస్ట్ సినిమాగా తెరకెక్కుతుంది 'ఏక్ మినీ కథ'. ఈ సినిమా ఇంతవరకు తెలుగు సినిమాల్లో ప్రస్తావించని ఓ బోల్డ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్ చూసిన వారికీ 'ఏక్ మినీ కథ' కాన్సెప్ట్ అర్ధం అయ్యుంటుంది. 'డస్ సైజ్ మేటర్..?' అనే బోల్డ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్, కావ్యతపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మరి ఇంకా రిలీజ్ డేట్ ఐతే రాలేదు కానీ సినిమా రిలీజ్ ముందు చేయాల్సిన హడావిడి మాత్రం బాగానే చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్టోరీ అందించడం విశేషం.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా, అవినాష్ లతో హీరో హీరోయిన్ ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పది నిముషాలకు పైగా జరిగిన ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం సైజ్ గురించి మాట్లాడుతూనే సాగిందని చెప్పాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా సినిమా మెయిన్ థీమ్ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఐతే స్టార్టింగ్ హీరో సంతోష్, హీరోయిన్ కావ్య ఇంటర్వ్యూలో పాల్గొనగానే ఫస్ట్ బొకే సైజ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ సైజ్ గోల మనకెందుకులే భయ్యా అంటూ హీరో అన్నాడు. కానీ యాంకర్స్ మాత్రం ఆ మేటర్ తీయడం ఆపలేదు. ఫన్నీగానే సాగింది కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో అది మాత్రం వందశాతం చెప్పలేకపోయారని ఇంటర్వ్యూ చూసినవారికి అర్ధమవుతుంది. ఈ సినిమాతో కార్తీక్ రాపోలు అనే నూతన దర్శకుడు పరిచయం అవుతుండగా.. హీరోయిన్ కావ్యతపర్ కూడా డెబ్యూ చేస్తోంది. ఈ సినిమాను యూవి కాన్సెప్ట్స్ అండ్ మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.