Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' నుంచి 'ఈ మాయలో' అంటూ సాగే ఏక్ మినీ మెలోడీ..!

By:  Tupaki Desk   |   18 March 2021 12:08 PM GMT
ఏక్ మినీ కథ నుంచి ఈ మాయలో అంటూ సాగే ఏక్ మినీ మెలోడీ..!
X
'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. హిందీ - ఇంగ్లీష్ - తెలుగు భాషల మిక్సింగ్‌ తో ఉన్న ఈ టైటిల్‌ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపిస్తోంది. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ స్టోరీ అందించారు. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మినీ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఈ మాయలో' అనే ఏక్ మినీ మెలోడీ పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'నిమిషమాగని మాయో హాయో.. వయసు వేడుక చేసే నాలో.. ఈ మాయలో పడిపోతున్నానే..'అంటూ సాగిన ఈ సాంగ్ కు ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ సమకూర్చారు. ఈ మెలోడీ గీతానికి శ్రీజో సాహిత్యం అందించగా.. లిప్సిక - శ్రీకర్ అగస్తీ కలిసి ఆలపించారు. ఈ సాంగ్ శ్రోతలని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ - సుదర్శన్ - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థగా ఏర్పడిన యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నారు.