Begin typing your search above and press return to search.

ఆస్కార్ లైబ్రరీలో బాలీవుడ్ సినిమా

By:  Tupaki Desk   |   10 Feb 2019 10:05 AM IST
ఆస్కార్ లైబ్రరీలో బాలీవుడ్ సినిమా
X
కొన్ని సినిమాలు అంతే. వర్తమానంలో ప్రేక్షకులు గుర్తించకపోయినా ఆదరించకపోయినా తర్వాత కాలంలో క్లాసిక్స్ గానో లేక విదేశాల్లో బెస్ట్ మూవీ గానో గుర్తింపబడతాయి. ఆ కోవలోకి వస్తోంది గత వారం విడుదలైన ఎక్ లడ్కీతో దేఖాతో ఐసా లగా. తండ్రి కూతుళ్ళు అనిల్ కపూర్ సోనం అహుజా మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా హోం సెక్సువల్ లవ్ అనే సున్నితమైన అంశంతో తెరకెక్కింది. రాజ్ కుమార్ రావు హీరోగా సోనంని ప్రేమలో పడేసె అమ్మాయిగా రెజినా వీళ్ళ మధ్య జరుగుతున్న సంఘర్షణ చూస్తూ తల్లడిల్లే తండ్రిగా అనిల్ కపూర్ నటించిన ఈ మూవీ మొత్తానికి మనల్ని కాదు కాని ఆస్కార్ వాళ్ళను మెప్పించింది .

ఆస్కార్ అవార్డులు అందించే అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి తమ కోర్ లైబ్రరీలో ఉంచేందుకు ఈ సినిమా కాపీ పంపమని నిర్మాతలకు పిలుపు అందించింది. దీంతో ఈ టీం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక సోనం అహుజా సంతోషం అయితే మాములుగా లేదు. నాన్నతో కలిసి మొదటిసారి నటిస్తే అది ఇంత ఘనత సంపాదించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. చక్కని మెసేజ్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ని ప్రేక్షకులు బాగా ఆదరించారని ఇప్పుడీ గుర్తింపు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉసిగోల్పిందని చెప్పింది.

ఈ పరిణామం పట్ల బాలీవుడ్ నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 20 కోట్ల దాకా వసూలు చేసింది. తక్కువ మొత్తమే అయినప్పటికీ టాక్ డివైడ్ గా రావడంతో దాని ప్రభావం పడుతోంది. అయితేనేం ఓ అరుదైన ఘనతను అందుకుంది. డీసెంట్ బడ్జెట్ లో తీసిన మూవీ కాబట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది