Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: మరో డిఫరెంట్ లెస్బియన్ లవ్ స్టొరీ!
By: Tupaki Desk | 27 Dec 2018 7:05 PM ISTబాలీవుడ్ లో కొత్తదనం లేదని ఈమధ్య విమర్శలు ఎక్కువయ్యాయి గానీ టాలీవుడ్ కంటే బోల్డ్ కంటెంట్ ఉన్న సబ్జెక్టులు హిందీలోనే ఎక్కువగా వస్తాయి. ఇదేకోవలో తెరకెక్కిన చిత్రం 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' ఈ సినిమాలో థీమ్ ఏంటంటే లెస్బియన్ లవ్ స్టొరీ. హిందీలో లెస్బియన్ లవ్ స్టొరీలు కొత్తకాదు .. ఆ థీమ్ తో ప్రయోగాత్మక సినిమాలు వచ్చాయిగానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో టాప్ హీరోయిన్ నటించిన సినిమా మాత్రం ఇదే.
ఈ సినిమాలో సోనమ్ కపూర్..రాజ్ కుమార్ రావ్.. అనిల్ కపూర్.. రెజినా కసాండ్రా ముఖ్యపాత్రల్లో నటించారు. సోనమ్ నాన్నగారు అనిల్ కపూర్ ఈ సినిమాలో నిజ జీవిత పాత్ర పోషించడం విశేషం. ఇక రెగ్యులర్ పేరెంట్స్ లాగే సోనమ్ కు రాజ్ కుమార్ రావ్ తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు.. కానీ సోనమ్ మరో అమ్మాయి(రెజినా)ని ప్రేమిస్తున్నానని ట్విస్ట్ ఇస్తుంది. సోనమ్ తన లెస్బియన్ లవ్ సీక్రెట్ ను రాజ్ కుమార్ కు చెప్పిన తర్వాత "ట్రూ లవ్ కు ఖచ్చితంగా అడ్డంకులు ఉంటాయి" అని చెప్తుంది. ఇంట్లో వాళ్ళు.. ప్రేమించిన ప్రియుడు ఈ అమ్మాయి - అమ్మాయి లవ్ కు ఎలా రియాక్ట్ అయ్యారు.. సోనమ్ లేడీ లవ్ చివరికి ఏమైంది అన్నది స్టొరీ.
లెస్బియన్ లవ్ మీద ఎవరి అభిప్రాయలు వారికి ఉండొచ్చుగానీ మెజారిటీ సందర్భాల్లో మాత్రం దాన్ని బూతులాగానే చిత్రీకరిస్తారు.. కానీ ఈ సినిమా అలా కాకుండా ఇద్దరు అమ్మాయిల మధ్య ఉండే ప్రేమను సున్నితంగా చూపించినట్టు అనిపిస్తోంది. అయినప్పటికీ ఇలాంటి అన్ కన్వెన్షనల్ లవ్ స్టొరీని మన ఆడియన్స్ లో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారన్నది సందేహమే. ఇలాంటి సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా నటించడం తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి రేపే అంశం. షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 1 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి.