Begin typing your search above and press return to search.
వైఫ్ ఆఫ్ కాలా మన బాపు బొమ్మే
By: Tupaki Desk | 8 Jun 2018 2:03 PM ISTచాలా ఏళ్ళ క్రితం అంటే ఓ ఇరవై సంవత్సరాల వెనక్కు వెళ్తే దర్శక దిగ్గజం బాపు గారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా రాంబంటు అనే సినిమా ఒకటి తీశారు. నటకిరీటి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కమర్షియల్ గా విజయం సాధించలేదు కానీ అందులో నటించిన వారికి పేరు వచ్చింది. అందులో ఆ సినిమాతోనే పరిచయమైన హీరోయిన్ ఈశ్వరి రావు కూడా ఉంది. దాని ఫలితం ప్రభావం తన కెరీర్ మీద పడింది. అవకాశాలు రాలేదు. రాంబంటు రిజల్ట్ తో పాటు ఈశ్వరి రావు హోమ్లీగా పద్ధతిగా ఉండటం కూడా గ్లామర్ పాత్రలు రాకుండా చేసింది. అదే టైంలో సౌందర్య ఫుల్ ఫామ్ లో ఉండటంతో వేచి చూసి వేసారిన ఈశ్వరి రావు చివరికి టీవీ సీరియల్స్ వైపు మళ్లారు. చాలా గ్యాప్ తర్వాత రవితేజ భద్ర సినిమాలో ప్రకాష్ రాజ్ భార్యగా మెప్పించిన ఈవిడకు ఛాన్సుల విషయంలో కథ మళ్ళి మొదటికే వచ్చింది. ఇన్నాళ్లకు తన దశ కాలాతో తిరిగిందనే చెప్పాలి.
కాలా ఫలితం పక్కన పెడితే మాస్ పాత్రలో ఈశ్వరి రావు అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఏకగ్రీవంగా మెప్పులు పొందేశారు. గ్రామీణ యాస లాంటి బాషతో మనవళ్లు ఉన్న వయసులో రజనిని ఉడికించే భార్యగా తనకు నూటికి నూరు మార్కులు పడిపోయాయి. అసలు ఇన్నాళ్లు ఇంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఎలా మిస్ చేసుకున్నామా అని అందరు అనుకుంటున్నారు. నేను లోకల్ లో నాని తల్లిగా పోసాని భార్యగా మెరిసిన ఈశ్వరి రావుకు సక్సెస్ వస్తున్నా కూడా అవకాశాలు రాకపోవడం మాత్రం భేతాళ ప్రశ్నే. లేట్ ఏజ్ పాత్ర అయినప్పటికీ రజనీకాంత్ కు జోడిగా ఆయనకు భార్యగా నటించడం అంటే మాటలు కాదుగా. ఇప్పటికీ త్రిష లాంటి హీరోయిన్లకు ఆ కల నెరవేరనేలేదు. ఈ లెక్కన మన బాపు బొమ్మ అదృష్టవంతురాలే. అయినా మన బంగారం విలువ పక్క రాష్ట్రం వాళ్ళు చూపిస్తే కానీ తెలియలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నా అవి పొగడ్తగానే తీసుకోవాలి.