Begin typing your search above and press return to search.

'ఈ సింగిల్ చిన్నోడే' అంటూ పాగల్ న్యూ సాంగ్ ప్రోమో!

By:  Tupaki Desk   |   1 Jun 2021 1:30 PM GMT
ఈ సింగిల్ చిన్నోడే అంటూ పాగల్ న్యూ సాంగ్ ప్రోమో!
X
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల మేకింగ్ స్టైల్ మెల్లగా మార్పు చెందుతోంది. ఎందుకంటే ఇదివరకు ప్రతి ఏడాదికి ఒకే సినిమా రిలీజ్ చేసే హీరోలు.. కరోనా మహమ్మారి ఇచ్చిన షాక్ తో స్పీడ్ పెంచేసారు. ప్రస్తుతం ఒక్కో హీరో ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇంకా డైరెక్టర్స్ విషయం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీలో పోటీ అనేది కనిపిస్తుందో అప్పుడే మేకర్స్ కూడా వేగం పెంచేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు టోటల్ సౌత్ ఇండస్ట్రీలో మనం ఈ మార్పును చూడవచ్చు. ఒక్కోసారి హీరోలే డైరెక్టర్స్ అయిపోవచ్చు.. కొరియోగ్రాఫర్స్ హీరోలుగా మారొచ్చు. ప్రస్తుతం నటుడి నుండి దర్శకుడుగా మారిన 'ఫలకనుమా దాస్' అదే విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా పాగల్.

హిట్ అనే ఇన్వెస్టిగేషన్ హిట్ తర్వాత రూట్ మార్చి లవ్ స్టోరీతో సిద్ధం అవుతున్నాడు విశ్వక్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్.. లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకులలో సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్స్.. సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖలతో రొమాన్స్ చేస్తున్నాడు విశ్వక్. అదేవిధంగా ఈ సినిమాలో మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే తాజాగా పాగల్ సినిమాలో మరో హీరోయిన్ చేరింది. ఆ భామ ఎవరో కాదు నివేత పేతురాజ్. ఈ సినిమాలో నివేతతో కూడా విశ్వక్ రొమాన్స్ చేయనున్నాడని టాక్. వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఇటీవలే రిలీజ్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుండి మరో సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. 'ఈ సింగిల్ చిన్నోడే' అనే టైటిల్ తో జూన్ 2న సాయంత్రం 5గంటలకు లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ రధన్ సంగీతం అందిస్తున్నాడు. బెన్నీదయాల్ ఆలపించిన ఈ యూత్ ఫుల్ సాంగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని టాక్. ఈ వీడియో సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లను హీరో ఫ్లర్ట్ చేసి పడేసినట్లు తెలుస్తుంది. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ అందించారు. ఈ సినిమాతో నరేష్ కుప్పిలి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. బెక్కెమ్ వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.