Begin typing your search above and press return to search.

ఈ తెలుగు సోయగం స్పీడ్ పెంచేది ఎప్పుడో..?

By:  Tupaki Desk   |   14 April 2021 1:30 PM GMT
ఈ తెలుగు సోయగం స్పీడ్ పెంచేది ఎప్పుడో..?
X
తెలుగు చిత్రపరిశ్రమలో 'అంతకుముందు ఆ తర్వాత' అనే సినిమాతో అడుగు పెట్టిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకొని మెల్లగా తనంతట తానే అవకాశాలు రాబట్టుకోవడం ప్రారంభించింది. కానీ కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లు గడిచినా జోరు కనిపించడం లేదు. ఇప్పటికి ఈషా కెరీర్ నెమ్మదిగా కొనసాగుతుంది. ఆకట్టుకునే సోయగం, అలరించే అభినయం కలిగిన ఈషా.. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా చేస్తూ పోతుంది. ఆ విధంగానే బందిపోటు.. అమితుమీ సినిమాలు చేసింది. ఇంతవరకు తెలుగులో పెద్ద‌గా హిట్స్ రాకపోవ‌డంతో ఆ మధ్యన తమిళంలో ట్రై చేసింది. మొదట్లో గ్లామర్ పరంగా హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు అవేమి లేవంటుంది.

ఇటీవలే అమ్మడు సినిమా కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేసిందని టాక్. ఆ మ‌ధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా గ్లామ‌ర‌స్ పాత్రలో క‌నిపించింది. అలాగే ఈ ఏడాది పిట్టకథలు అనే వెబ్ సిరీస్ లో నటించింది. చేసింది బోల్డ్ పాత్రే అయినప్పటికీ ఈషాకు ఎలాంటి ఉపయోగం కలిగించలేదు ఆ వెబ్ సిరీస్. అవసరమైతే సినిమాకోసం అందాల డోస్ పెంచనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయి అనేది ఇషాకు అడ్డుగోడగా మారింది. అందుకే ఇన్నేళ్ళైనా అమ్మడికి సరైన బ్రేక్ లభించలేదు. ఏ స్టార్ హీరో సినిమాలో అవకాశం రాలేదు. కానీ ప్రస్తుతం స్టార్ లేదు మీడియం హీరోల సినిమాల్లో అవకాశం పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఇకనైనా ఏదైనా స్టార్ హీరో సినిమాలో మెరుస్తుందేమో!