Begin typing your search above and press return to search.

లస్ట్ స్టోరీస్ తో అయినా బ్రేక్ వస్తుందా?

By:  Tupaki Desk   |   1 Nov 2019 7:00 AM IST
లస్ట్ స్టోరీస్ తో అయినా బ్రేక్ వస్తుందా?
X
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు తప్ప అన్ని భాషల భామామణులు ఉంటారు. పాపం ఒకరిద్దరు తెలుగు భామలు మాత్రం టాలీవుడ్ లో అలుపెరగని పోరాటం చేస్తూ తెలుగు వారు ఉన్నారని చాటుతూ ఉంటారు. అయితే వారి పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుగానే ఉంటుంది కానీ ఆఫర్లేమీ వారిని వెతుక్కుంటూ రావు. ఓరుగల్లు భామ ఈషా రెబ్బాకు మొదట్లో కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఈమధ్య మళ్ళీ రేసులో వెనకబడింది.

ప్రస్తుతం ఈషా చేతిలో ఒక లేడీ ఒరియంటెడ్ ఫిలిం ఉంది.. అది కాకుండా మరే ఇతర క్రేజీ ప్రాజెక్టులు లేవు. అయితే రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వారి 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ లో నటించేందుకు డీల్ సైన్ చేసిందట. లస్ట్ స్టోరీస్ హిందీలో సూపర్ గా సక్సెస్ కావడం కాకుండా కియారా అద్వానికి యూత్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈషా రెబ్బాకు అలాంటి క్రేజ్ వస్తుందేమో వేచి చూడాలి. ఈషా నటించే ఎసిసోడ్ కు 'ఘాజి' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

బోల్డ్ వ్యవహారాలు చాలా కామన్ అయిన బాలీవుడ్ ఆడియన్స్ కే లస్ట్ స్టోరీస్ ఒక పెద్ద ఝలక్ ఇచ్చింది. మన తెలుగు ఆడియన్స్ ను అ షాక్ ఇంకా పెద్దదిగా ఉంటుంది. సంచలనాలు సృష్టించడం ఖాయమే. ఈషా రెబ్బా ఏ ఎపిసోడ్ లో నటించేందుకు రెడీ అయిందో తెలియదు కానీ ఒకవేళ కియారా వైబ్రేటర్ సీన్ ఉండే ఎపిసోడ్ అయితే మాత్రం రచ్చ రచ్చ కావడం ఖాయం!