Begin typing your search above and press return to search.

అరవిందతోపాటు ఆమెకూ ఛాన్స్

By:  Tupaki Desk   |   22 May 2018 4:46 AM GMT
అరవిందతోపాటు ఆమెకూ ఛాన్స్
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో మొదట్లో ఒక్క హీరోయినే ఉండేది. తరవాత ట్రెండ్ మార్చి ఇద్దరు హీరోయిన్ల స్టయిల్ లోకి వచ్చాడు. తాజాగా ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమా కోసం దువ్వాడ జగన్నాథమ్ బికినీతో సెగలు రేపిన పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నాడు.

అరవింద సమేత వీర రాఘవలో పూజా ఒక్కతే హీరోయిన్ అని ముందు నుంచి అనుకుంటున్నా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశముందని తెలుస్తోంది. ఈ రోల్ కోసం వేరే భాషల అమ్మాయిలు కాకుండా తెలుగమ్మాయి అయితేనే బెటర్ అని త్రివిక్రమ్ ఫీలయ్యాడట. ఈమధ్య వచ్చిన అమీ తుమీ సినిమాలో ఈషా రెబ్బా యాక్షన్ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ సినిమా కోసం ఎంచుకున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈషాకు అరవింద సమేతలో రోల్ గురించి నెరేట్ చేయడం కూడా అయిపోయిందని లేటెస్ట్ టాక్.

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అంతకుముందు.. ఆ తరవాత సినిమాతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంటరయింది. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇంతవరకు పెద్ద సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఒకేసారి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అనేసరికి హ్యాపీగా ఓకే చెప్పేసిందని తెలిసింది.