Begin typing your search above and press return to search.

అబ్బా.. అలాంటి సినిమాలో ఈషా రెబ్బా

By:  Tupaki Desk   |   26 April 2018 11:55 AM IST
అబ్బా.. అలాంటి సినిమాలో ఈషా రెబ్బా
X
టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మంచి ప్రాజెక్టులలో తనను తాను చూసుకోగలుగుతోంది. కాకపోతే ఇప్పటివరకూ ఈషాకు సరైన కమర్షియల్ హిట్ పడకపోవడం ఒక్కటే లోటు. ఆ ఒక్క లోటు తీరిపోతే ఈ అమ్మడు కచ్చితంగా క్రేజీ హీరోయిన్ అయిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తనకు అలాంటి ప్రాజెక్టు దక్కిందని ఆశలు పెట్టుకుంది ఈషా రెబ్బా.

రీసెంట్ గా అ! చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సుబ్రమణ్యపురం పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి.. ఈ మూవీని రూపొందించబోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండడం విశేషం కాగా.. ఈ మూవీ తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోతుందని ఈషా రెబ్బా అంటోంది. 'నేను ఓ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే మొటిసారి. ఈ అవకాశం రాగానే విపరీతమైన ఎగ్జైట్మెంట్ కు గురయ్యాను' అంటోంది ఈషా రెబ్బా.

'సుబ్రమణ్యపురం చిత్రంలో ప్రియ అనే ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నేను కనిపిస్తాను. పురాతన సాంప్రదాయాలను ఆచరించే ఓ గ్రామ ప్రెసిడెంట్ కూతురు పాత్ర అది. ఆమె అందంగా ఉండడమే కాదు.. సాంప్రదాయ వాది కూడా. గ్రామంలోని వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది. ఇలాంటి అమ్మాయి కార్తీక్ అనే హేతువాది.. నాస్తికుడితో ప్రేమలో పడుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కు ఆమె ఎలా సహకరించింది అన్నదే సినిమా' అంటోంది ఈషా రెబ్బా.