Begin typing your search above and press return to search.

ఈషా రెబ్బా ఇలాగైతే ఎలాగబ్బా!!

By:  Tupaki Desk   |   12 Sept 2018 3:00 PM IST
ఈషా రెబ్బా ఇలాగైతే ఎలాగబ్బా!!
X
తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడమే అరుదు. వచ్చినా ఉపయోగించుకుని ఇక్కడే స్టార్లుగా ఎదిగిన వాళ్ళు మరీ మరీ అరుదు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం కన్నడ మలయాళం పంజాబీ అంటూ బాషా భేదం లేకుండా అందరు టాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న వాళ్లే. ఉన్న తెలుగు బ్యూటీస్ లో అందంతో పాటు అభినయం ఉన్న అమ్మాయిగా ఈషా రెబ్బని చెప్పుకోవచ్చు. 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ అంతకు ముందు ఆ తర్వాత తో పరిచయమైన ఈష అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఎక్కువ సినిమాలు చేయలేదు. మళ్ళి ఆయనే అల్లరి నరేష్ సరసన బందిపోటు ఛాన్స్ ఇచ్చాడు కానీ మొదటిదే నయం అనే రిజల్ట్ వచ్చింది. దీంతో కొంత గ్యాప్ వచ్చిన ఈషాకు ఫైనల్ బ్రేక్ కూడా ఇంద్రగంటినే ఇవ్వాల్సి వచ్చింది. గత ఏడాది వచ్చిన అమీ తుమీలో భరణి కూతురిగా అడవి శేష్ లవర్ గా తమాషా పాత్రలో మెప్పించిన ఈషా ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మించిన అ! లో హోమో సెక్సువల్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసింది.

ఇటీవలే చేసిన బ్రాండ్ బాబు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. అందంగా ఉండే పనిమనిషిగా హీరోను ప్రేమలో పడేసే పాత్రలో తనవరకు న్యాయం చేసినప్పట్టికి హీరో మొదలు దర్శకుడి దాకా అందరు తేడా కొట్టించడంతో మరో ప్లాప్ పడిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఈషా దాని వివరాలు మాత్రం చెప్పడం లేదు. కానీ ఈషా ఈ మధ్య బాగా ఒళ్ళు చేయటం నెగటివ్ గా మారుతోంది. మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో ఇలా బాడీ ఫిట్ నెస్ మీద కంట్రోల్ తప్పిపోయి షేప్ అవుట్ అయిపోతే గోల్డెన్ డేస్ మిస్ చేసుకున్నట్టు అవుతుందని సినీ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఇవి విని ఈషా జాగ్రత్త పడితే బెటర్. ఒడ్డు పొడవు అన్ని ఉంటేనే అవకాశాలు కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇలా కొంచెం లావైనా సరే అడగటం మానేస్తారు. మరి ఈ తెలుగమ్మాయి జాగ్రత్త పడుతుందో లేదో వేచి చూడాలి.