Begin typing your search above and press return to search.

'లాకెట్' చూపి ఆకట్టుకుంటున్న గ్లామర్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   2 May 2021 2:30 AM GMT
లాకెట్ చూపి ఆకట్టుకుంటున్న గ్లామర్ బ్యూటీ!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓవైపు కరోనా మహమ్మారి ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు తెలుగు హీరోయిన్స్ వారికీ తోచిన బాటలో అభిమానులకు కనువిందు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు కాకుండా సోషల్ మీడియాలోనే ఎక్కువగా వినోదం పంచే తెలుగు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే సినిమాలలో తక్కువగా కనిపించే ఈ వయ్యారి.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం దర్శనమిస్తుంది. అలాగే వచ్చిన ప్రతిసారి ఏదొక విధంగా అందాలను కుర్రకారు పై గుప్పించి మనసులు దోచుకుంటుంది. ఈసారి కూడా అలాంటి పనే చేసింది ఈషా.

కరోనా నేపథ్యంలో సినిమాలు, థియేటర్స్ అన్ని మళ్లీ మూతపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రోజురోజుకి కరోనా భయంతో జనాలు అల్లాడిపోతున్నారు. అందుకే భయంతో ఎక్కడివారు అక్కడే ఇంటిపట్టున ఉంటున్నారు. అలాంటి వారు మాములుగా ఏమి తోచక సోషల్ మీడియాలోకి వస్తే ఈషా లాంటి కుర్రబ్యూటీలు.. కొద్దిగా కరోనా టెన్షన్ నుండి బయటపడేందుకు మెడిసిన్ లా ధైర్యం ఇస్తున్నారు. తాజాగా ఈషా చేసిన పని అలాంటిదే.

ఏంటంటే.. అమ్మడు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో న్యూ పిక్ పోస్ట్ చేసింది. మాములుగా ఈషా పిక్ పెట్టిందంటే ఖచ్చితంగా కాస్తో కూస్తో గ్లామర్ షో చేసి ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ ఈసారి కొంచం డిఫరెంట్ గా దర్శనమిచ్చింది అమ్మడు. ఎలాగంటే.. ఎప్పటిలాగే అందంగా డ్రెస్సింగ్ స్టయిల్, హెయిర్ స్టైల్ తో కనిపించడం మాములే. కానీ మెడలో దుర్గామాత లాకెట్ తో కనిపించి ధైర్యం కల్పిస్తుంది. ఇలాంటి భయానక పరిస్థితిలో ఈషా ఇలా మెడలో దుర్గా మాత లాకెట్ ధరించి కరోనా గురించి భయపడవద్దు అన్నట్లుగా భరోసా ఇస్తున్నట్లు భావిస్తున్నారు నేటిజన్లు. ఈ విషయంలో ఈషాపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈషా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కెయండి.