Begin typing your search above and press return to search.

అందాలకు హద్దులు చెరిపేసినట్లుందిగా ఈ తెలుగు సుందరి!

By:  Tupaki Desk   |   9 March 2021 4:30 AM GMT
అందాలకు హద్దులు చెరిపేసినట్లుందిగా ఈ తెలుగు సుందరి!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారని.. అందుకే అవకాశాలు తెచ్చుకోలేరని ఇదివరకు అంటుండేవారు. రాకరాక అవకాశం వస్తే గనక గ్లామర్ షోకు దూరంగా ఉండేవారని టాక్ ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో కనిపించడంలేదు మొత్తంగా మారిపోయింది. మంచి అవ‌కాశం వస్తే ఎలాంటి విధంగా అయినా సత్తా చాటడానికి రెడీగా ఉంటున్నారు. అవసరం అనుకుంటే ముంబై ముద్దుగుమ్మలను బీట్ చేసేందుకు తెలుగు అందాలను ఎరవేస్తున్నారు. అటు యాక్టింగ్ పరంగా.. ఇటు గ్లామర్ పరంగా ఈమద్యే ఫేమ్ అవుతోంది తెలుగు వయ్యారి ఈషా రెబ్బా.

సుమంత్ అశ్విన్ సరసన 'అంతకుముందు ఆ తర్వాత' అనే సినిమాతో ద్వారా అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీలోనే మంచి టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కానీ అవకాశాలు ఆశించినట్లుగా రాలేదు. అప్పటినుండి కెరీర్ మరీ జోరుగా కాకుండా మెల్లగానే సాగుతుంది. అభినయంతో పాటు గ్లామర్ కలిగిన ఈ వయ్యారి వస్తున్న అవకాశాలు చేస్తోంది. చేస్తూనే ఉంది కానీ ఇంతవరకు సరైన హిట్ పడలేదు. అందుకే మధ్యలో తమిళం వైపు కూడా అడుగులేసింది. మొదట్లో అందాల ఆరబోతకు హద్దులు పెట్టుకుంది కానీ ఇప్పుడు అలాంటివేం లేవంటోంది. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. అందులో వైట్ టాప్ జీన్స్ ప్యాంటు ధరించి బెంచీ పై కూర్చున్న పిక్ షేర్ చేసింది. బ్లాక్ కళ్ళజోడుతో వీపు చూపి ఊరిస్తోంది. ప్రస్తుతం అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.