Begin typing your search above and press return to search.

#హాట్ షూట్.. తెలుగ‌మ్మాయి ప్ర‌యోగాలేంద‌బ్బా

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:12 PM IST
#హాట్ షూట్.. తెలుగ‌మ్మాయి ప్ర‌యోగాలేంద‌బ్బా
X
రొటీన్ గా ఉంటే ఎవరూ ప‌ట్టించుకోరు. ఎప్ప‌టిక‌ప్పుడు నిత్యనూతనంగా వెరైటీగా ఏదైనా చేస్తేనే ఇటువైపు చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రంగుల ప్ర‌పంచంలో ఠ‌ఫ్ కాంపిటీష‌న్ త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే అందుకు ఏం చేయాలో తెలుగ‌మ్మాయిలు బాగా ఆవేర్ నెస్ పెంచుకుంటున్నారు.

ఈ రంగంలో ప‌ట్టువిడుపు చాలా ఇంపార్టెంట్. ఇక ఫోటోషూట్ల విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు. ముంబై ర్యాంప్ వాక్ మోడ‌ల్స్ తో పోటీప‌డుతూ దులిపేయాలి. ఇక ఇలాంటి ఎన్ని ప్ర‌యోగాలు చేసినా తెలుగ‌మ్మాయిల‌కు కొన్ని రూల్స్ త‌ప్ప‌నిస‌రి. మ‌రీ టూమచ్ గా ఆర‌బోసేస్తే తెలుగుద‌నం మిస్స‌వుతుంది. అందుకే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించాలి. ఈ విష‌యంలో తెలంగాణ అమ్మాయి మాజీ మిస్ ఇషా రెబ్బా నాలుగు ఆకులు ఎక్కువే తింద‌ని తాజా ఫోటోషూట్ చెబుతోంది.

డార్క్ లో అదిరిపోయే ఫోటోషూట్ తో ఇషా దుమారం రేపుతోంది. ఈ లుక్ ప‌ర్ఫెక్ట్ అప్పియ‌రెన్స్ తో కుర్రాళ్ల‌లోకి దూసుకెళుతోంది. హెవీ నెక్ లైన్ ఆభ‌ర‌ణాల‌తో టూహాట్ గా క‌నిపిస్తూనే.. అలా థై సొగ‌సుల్ని ఆవిష్క‌రిస్తూ ఇషా ఇచ్చిన ఆ ఫోజు కుర్రాళ్ల‌లో హాట్ టాపిక్ గా మారింది. అందానికి అందం క‌వ్వింత ఎక్క‌డా త‌గ్గ‌లేదు ఇషాలో. ట్రెడిష‌న్ ప‌రంగానూ ఎక్క‌డా హ‌ద్దు మీర‌లేదు. వ‌ర‌స‌గా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటున్న ఇషా రెబ్బా కెరీర్ ప‌రంగా షార్ప్ అవుతోంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో కీల‌క పాత్ర పోషిస్తున్న ఇషా త‌మిళంలో ఓ సినిమా క‌న్న‌డ‌లో మ‌రో సినిమా చేస్తోంది.