Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయ్ కూల్ అండ్ చిల్ లుక్

By:  Tupaki Desk   |   14 May 2021 10:30 AM GMT
తెలుగ‌మ్మాయ్ కూల్ అండ్ చిల్ లుక్
X
అందాల క‌థానాయిక ఇషా రెబ్బా కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. ఓవైపు క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. అగ్ర హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో అవ‌కాశం ద‌క్కించుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవ‌లే డిజిట‌ల్ లోనూ ఆరంగేట్రం చేసింది.

ఓటీటీ వేదిక‌పై `పిట్ట‌క‌థ‌లు` సిరీస్ లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మునుముందు ప‌లు క్రేజీ వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో ఇషా రెబ్బా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఇన్ స్టా వేదిక‌గా అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా ఈ వ‌రంగ‌ల్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇషా కూల్ అండ్ చిల్ లుక్ లో ఎంతో ప్లెజెంట్ గా అందంగా క‌నిపిస్తోంది. టాప్ లెస్ లుక్... డిజైన‌ర్ ఫ్రాకులో ఈషా ఎంతో క్యూట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అభిమానుల్లో ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి ఇషా న‌టించిన తెలుగు-త‌మిళ చిత్రాలు రిలీజ్ ల‌కు సిద్ధం కానున్నాయి. అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్.. జీవీప్ర‌కాష్ న‌టించిన ఆయిరం జేన్మ‌గ‌ల్ చిత్రాల్లో ఈషా కీల‌క పాత్రలు పోషించింది. ఇవి త‌నకు మంచి పేరు తెస్తాయ‌న్న హోప్ తో ఉందిట‌.