Begin typing your search above and press return to search.

వెంకీ సినిమాలో ఆ యంగ్ హీరోయిన్‌?

By:  Tupaki Desk   |   2 March 2018 9:40 AM GMT
వెంకీ సినిమాలో ఆ యంగ్ హీరోయిన్‌?
X
చిత్రం... నువ్వు నేను... జ‌యం లాంటి చిత్రాల‌తో హిట్ కొట్టిన తేజ‌... కొన్నాళ్ల పాటూ సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆయ‌న తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాడు. మ‌ళ్లీ హీరోలు తేజ సినిమాల్లో న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న అబ్బాయ్ రానాతో సినిమా తీసిన తేజ‌.. ఇప్పుడు బాబాయ్ వెంకీతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.

వెంకీ-తేజ చేయ‌బోయే ఈ సినిమాకు ఆటా నాదే... వేటా నాదే అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇందులో వెంకీ జ‌త‌గా శ్రియను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ మార్చిలోనే షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. కాగా ఇందులో మ‌రో ముఖ్య‌పాత్ర‌కి తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బాకి ఛాన్స్ దొరికిన‌ట్టు స‌మాచారం. నారా రోహిత్ కూడా న‌టించే ఈ సినిమాలో అత‌నికి ఈషా రెబ్బా జోడీగా న‌టించ‌నుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈషా రెబ్బా పేరు ప్ర‌క‌టించాల్సి ఉంది. అ సినిమాలో చిన్న పాత్ర‌లో క‌నిపించిన ఈషాకు మంచి పేరే ద‌క్కింది. ఆమె లుక్స్ కూడా గ‌తంతో చాలా మెరుగయ్యాయి. దీంతో తేజ ఈ పాత్ర‌కు ఆమెకు ఛాన్సివ్వ‌డానికి సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా వెంకీ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

శ్రియ - వెంకీ జంట‌గా గ‌తంలో గోపాల గోపాల.... సుభాష్ చంద్ర‌బోస్ సినిమాలో క‌లిసి న‌టించారు. ఇప్పడు మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌... ఏకే ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంయుక్త‌లంగా సినిమాను తెర‌కెక్కించ‌నుంది. నారా రోహిత్‌... వెంకీ క‌లిసి చేస్తున్న తొలి సినిమా ఇదే. వెంకీ కూడా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారి న‌టిస్తున్నాడు. క‌నుక ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.