Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అల్ట్రా స్టైలిష్ తెలుగు పిల్ల!

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:39 PM IST
ఫోటో స్టొరీ: అల్ట్రా స్టైలిష్ తెలుగు పిల్ల!
X
ముంబై భామలకంటే తెలుగు బ్యూటీలు ఏ విషయంలో తక్కువ? అందుకే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో సంక్రాంతి సందర్భంగా ఒక చక్కటి పసుపురంగు చీరలో తళుక్కున మెరిసింది. సంక్రాంతికి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మోడరన్ లుక్ లో ప్రాణాలు తోడేస్తోంది.

ఈషా కొత్తగా షేర్ చేసిన ఫోటోలో ఓ చిట్టిపొట్టి జీన్స్ నిక్కరు వేసుకుంది. పైనేమో లైట్ బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. జుట్టును కొప్పులా ముడేసుకుంది. ఈషా పైనేమో సూర్య కిరణాలు.. బ్యాక్ గ్రౌండ్ లో సముద్రపు కెరటాలు ఫోటో మాత్రం అదిరిపోయింది. అసలే ఈషా లైట్ గా బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఈ డ్రెస్ లో ఆ సన్ లైట్ లో చాకొలేట్ లా ఉంది.

సినిమాల విషయానికి వస్తే ఈషా లాస్ట్ సినిమా 'సుబ్రమణ్యపురం' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపుగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈషా తన నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. మరి డిస్కషన్లు జరుగుతున్నాయేమో.