Begin typing your search above and press return to search.

సొగసులతో నిషా ఇస్తున్న ఈషా

By:  Tupaki Desk   |   2 May 2018 8:12 AM GMT
సొగసులతో నిషా ఇస్తున్న ఈషా
X
టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బా వరుసగా ఛాన్సులు అందుకుంటోంది. అంతకు ముందు ఆ తర్వాత అంటూ ఫిలిం కెరీర్ ప్రారంభించిన ఈ హైద్రాబాదీ భామ.. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయడంలో బిజీగా ఉంది ఈ భామ.

ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈషా రెబ్బా కెరీర్ లో ఈ ఏడాది స్పెషల్ గా నిలిచిపోనుంది. ఇప్పటికే అ! చిత్రం లో తన ట్యాలెంట్ చూపించిన ఈషా రెబ్బా.. సుబ్రమణ్యపురం అంటూ మరో సినిమాను కూడా ఈ ఏఢాదే రిలీజ్ చేసేస్తోంది. గతేడాది మూడు సినిమాలలో కనిపించిన ఈ భామ.. ఈ ఏడాది కూడా అదే స్పీడ్ చూపించే ఛాన్స్ ఉంది. అయితే.. ఫ్రంట్ లైన్ సినిమాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం ఈషా ఇంకా వెనుకబడే ఉంది. తన కెరీర్ ను ఈ మెట్టు కూడా ఎక్కించేదుకు కంకణం కట్టుకున్న ఈ సుందరి.. ఇప్పుడు తన అందాలనే పెట్టుబడిగా చేసేసుకుంటోంది.

సోషల్ మీడియాలో షార్ట్ డ్రెస్సులతో ఈ బ్యూటీ తెగ హంగామా చేసేస్తోంది. గ్లామర్ గా కనిపించేందుకు అంతగా అభ్యంతరాలను చూపించినట్లు ఎప్పుడూ కనిపించలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈ డోస్ మరింతగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. చిట్టి పొట్టి బట్టలలో ఈషా రెబ్బాను చూస్తున్న అభిమానులకు నిషా పెరిగిపోతోందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.