Begin typing your search above and press return to search.

స్పోర్ట్స్ లో ఉంటే సానియా మీర్జాలా ఏలేది

By:  Tupaki Desk   |   7 May 2022 2:30 AM GMT
స్పోర్ట్స్ లో ఉంటే సానియా మీర్జాలా ఏలేది
X
అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్న ఈ తెలుగ‌మ్మాయ్ ఎవ‌రో కొత్త‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పేరు ఈషా రెబ్బా. అందాల పోటీల్లో నిరూపించుకుని అటుపై టాలీవుడ్ లో క‌థానాయిక‌గా అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా పుంజుకుంటోంది. అడుగులు నెమ్మ‌దిగా వేసినా ఒక్కో అడుగును తెలివిగా ముందుకు వేస్తోంది. తాను ఆశించిన స్టార్ డ‌మ్ చిక్కేవ‌ర‌కూ ఈ ప‌రుగును ఆపేదేలే! అంటూ ముందుకు సాగిపోతోంది.

తెలుగ‌మ్మాయిలు మ‌డిగ‌ట్టుకుని కూచునే రోజులు పోయాయ్ అని కూడా నిరూపిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఈజీగా సినీవ‌ర‌ల్డ్ ని షేక్ చేస్తోంది. వ‌రంగల్ బ్యూటీ ఈషా రెబ్బా ఇత‌ర భామ‌ల‌కు ధీటుగా వ‌రుస ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగా మారుతోంది. ఇప్ప‌టికే ఈషా కి ఇన్ స్టాలో భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. వారి కోసం అవ‌స‌ర‌మైన ట్రీట్ ని ఈ తెలుగ‌మ్మాయ్ ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంది. తాజాగా ఈషా హాటెస్ట్ లుక్ ఒక‌టి యూత్ ని వెంటాడుతోంది.

ఇందులో ఈషా పూర్తిగా అథ్లెటైజ‌ర్ లుక్ లో క‌నిపించింది. పాపుల‌ర్ బ్రాండ్ స్పోర్ట్స్ దుస్తుల్ని ధ‌రించి థై సొగ‌సుల్ని ఎలివేట్ చేస్తోంది. కాలికి ఎంపిక చేసుకున్న ఆ స్పోర్ట్స్ షూ సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. ఈషా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా ఈ ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. ఈషా స్పోర్ట్స్ లో ఉంటే సానియా మీర్జాలా ఏలేది అంటూ కితాబిచ్చేస్తున్నారు ఈ ఫోటో లు చూసిన వారంతా.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల ఈ బ్యూటీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రంలో న‌టించింది. అఖిల్ తో పెళ్లి చూపులు బాగానే క‌నెక్ట‌య్యాయి. అలాగే మ‌రిన్ని సినిమాల‌కు క‌మిటైనా లాక్ డౌన్ వ‌ల్ల వెయిటింగ్ లో ఉంది ఈ బ్యూటీ. వీటిలో చాలా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈషా ప్ర‌స్తుతం ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల గురించి ఈషా స్వ‌యంగా వెల్ల‌డిస్తుందేమో చూడాలి.