Begin typing your search above and press return to search.

ఆమె ‘లేడీ నాని’ అంట..

By:  Tupaki Desk   |   5 Aug 2017 12:59 PM GMT
ఆమె ‘లేడీ నాని’ అంట..
X
తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు రాణించడం అరుదు. ఇక్కడ మంచి అవకాశాలు దక్కక చాలామంది తెలుగమ్మాయిలు తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోవడం తెలిసిందే. ఐతే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడో తెలుగమ్మాయి మన సినిమాల్లో సత్తా చాటుకుంటోంది. ఆమే.. ఈషా రెబ్బా. ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత ‘జెంటిల్ మన్’ సినిమాలో నటించిన ఈషా.. ఈ మధ్య వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. రెండు నెలల కిందట విడుదలైన ‘అమీతుమీ’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. లేటెస్టుగా రిలీజైన ‘దర్శకుడు’ సినిమాకు టాక్ ఏమంత బాగా లేనప్పటికీ ఈషాకు మాత్రం మంచి పేరే వచ్చింది.

‘దర్శకుడు’ నిర్మాత అయిన సుకుమార్ ఈషా మీద ప్రశంసలు కురిపించేశాడు. ఆమె హీరోయిన్లలో నాని లాగా మంచి పేరు తెచ్చుకుందని.. చాలా సహజంగా నటిస్తూ అందరినీ మెప్పిస్తోందని.. అందుకే ఆమెను ‘లేడీ నాని’.. ‘లేడీ నేచురల్ స్టార్’ అంటున్నారని సుకుమార్ పేర్కొనడం విశేషం. ఈషా పెర్ఫామెన్స్ గురించి తనతో చాలామంది చెప్పారని.. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందని.. ఆమె మున్ముందు మరిన్ని అవకాశాలు అందుకుంటుందని సుకుమార్ అన్నాడు. అలాగే తన అన్న కొడుకు.. ‘దర్శకుడు’ హీరో అశోక్ మీద కూడా ప్రశంసలు కురిపించాడు సుకుమార్. అతడి గురించి కూడా అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారని చెప్పాడు. ఐతే ఈషాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్న మాట వాస్తవమే కాదు.. అశోక్ విషయంలో మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాకే వినిపిస్తోంది.