Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఈడు బాగా రొటీన్ ఏహా!!
By: Tupaki Desk | 12 Aug 2016 6:26 PM ISTకమెడియన్ హీరో సునీల్ కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. వీడు గోల్డ్ ఎహే అనే టైటిల్ పై తెరకెక్కుతున్న మూవీకి.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. సునీల్ కి జంటగా సుష్మారాజ్ రిచా పనాయ్ లు నటించిన ఈ మూవీ టీజర్ చూస్తే సునీల్ ఇక మారడెహ అనిపించడం ఖాయం.
టీజర్ ప్రారంభం నుంచి సునీల్ చేసే రచ్చ కంటే.. మాస్ మూవీ హంగులు.. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు.. కుప్పల కొద్దీ విలన్లు కనిపించేస్తుంటాయి. వీటిలో సునీల్ ఓ వెహికల్ పై నుంచి రన్నింగ్ ట్రైన్ పైకి జంప్ చేసే సీన్ కూడా ఉందంటే.. ఏ రేంజ్ లో ట్రై చేశారో అర్ధమవుతుంది. మధ్యమధ్యలో సునీల్ కూడా కొంచెం కామెడీ చేస్తుంటాడు లెండి. అయితే.. సునీల్ కంటే ఎక్కువగా పక్కనున్నోళ్లే ఎక్కువగా ట్రై చేయడం విశేషం.ఇక హీరోయిన్స్ కూడా బాగానే కనిపించారు. సునీల్ కాస్త లావుగా కనిపిస్తున్నా.. ప్యాకుల పేరు చెప్పి నీరసించిన ఫేస్ కంటే.. ఇదే చాలా బెటర్ అనాల్సిందే. ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ ఏంటంటే.. అసలు సునీల్ కు ఒక్క డైలాగ్ కూడా లేదు. అంటే మనోడు సినిమాలో మాటలు రాని అబ్బాయిగా చేస్తున్నాడా?
మొత్తంగా చూస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన జక్కన్న టైపులోనే ఈడు గోల్డ్ ఎహె ట్రైలర్ ఉందని చెప్పాల్సింది. జక్కన్నకి యావరేజ్ టాక్ వచ్చినా.. వసూళ్లు బాగానే వచ్చాయి.