Begin typing your search above and press return to search.

క్రేజీ 'పాగల్' సాంగ్.. ఈ సింగిల్ చిన్నోడే..!

By:  Tupaki Desk   |   2 Jun 2021 1:30 PM GMT
క్రేజీ పాగల్ సాంగ్.. ఈ సింగిల్ చిన్నోడే..!
X
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పాగల్'. ఇందులో నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కొత్త దర్శకుడు న‌రేష్ కొప్పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ - టీజర్ - రెండు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఈ సింగిల్ చిన్నోడే' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'ఈ సింగిల్ చిన్నోడే.. న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే.. సిగ్నల్ గ్రీనే చూసాడే.. పరుగులు పెట్టాడే..' అంటూ సాగిన ఈ క్రేజీ సాంగ్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. మన పాగల్ ఒకేసారి సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ లను ప్రేమలోకి దించడానికి ట్రై చేయడాన్ని ఈ పాటలో చూపించారు. ఇందులో విశ్వక్ సేన్ స్క్రీన్ ప్రెజెన్స్ - స్టెప్పులు అలరిస్తున్నాయి. యువ హీరో ట్రెండీ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

'ఈ సింగిల్ చిన్నోడే' సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ రథన్ ఫ్రెష్ ట్యూన్ సమకూర్చారు. కృష్ణ కాంత్ క్యాచీ లిరిక్స్ అందించగా.. బెన్నీ దాయాల్ తనదైన శైలిలో ఆలపించారు. ఈ పాటకు విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన 'పాగల్' చిత్రం కరోనా పరిస్థితుల్లో వాయిదా పడింది.