Begin typing your search above and press return to search.

వీడియో: ఏదో ఏదో.. అంటూ గుండె గిల్లుతున్నారుగా..

By:  Tupaki Desk   |   29 Aug 2021 3:10 PM IST
వీడియో: ఏదో ఏదో.. అంటూ గుండె గిల్లుతున్నారుగా..
X
న‌వ‌త‌రం ఆర్టిస్టుల‌తో రూపొందిస్తున్న ప్రేమ‌క‌థా చిత్రం `మ‌ధుర వైన్స్`. సన్నీ నవీన్- సీమా చౌదరి- సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. జ‌య కిషోర్ బండి దర్శకత్వంలో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌తం- తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి పెరిగింది. త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం- పంచతంత్రం చిత్రాలు కూడా రానున్నాయ‌ని.. మధుర వైన్స్ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని.. సినిమా మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని నిర్మాత‌లు ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి `ఏదో ఏదో..` అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విడుదల చేశారు. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌త‌రం గుండెను గిల్లుతోంది. ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సెప్టెంబర్ 17న మధుర వైన్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్- జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి జ‌య కిషోర్ కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. కార్తీక్- జై సంగీతం అందిస్తున్నారు.