Begin typing your search above and press return to search.

ఏడు గంటల విచారణలో ముమైత్ ఖాన్ ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   16 Sept 2021 10:00 AM IST
ఏడు గంటల విచారణలో ముమైత్ ఖాన్ ఏం చెప్పింది?
X
డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ హాజరయ్యారు. దాదాపు ఏడు గంటలకు పైనే విచారణను ఎదుర్కొన్న ఆమె.. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందితులైన కెల్విన్.. జీషాన్ అలీలు తనకు తెలుసునని ఆమె చెప్పినట్లుగా సమాచారం. అయితే.. హైదరాబాద్ లోని కొన్ని పార్టీల్లో వారు పాల్గొనేవారని.. ఆ సందర్భంగా మాత్రమే తెలుసని చెప్పినట్లుగా తెలుస్తోంది. అధికారులు కోరనట్లుగా ఆమె తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్ మెంట్లను అధికారులకు సమర్పించారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా ఆమె బ్యాంకు ఖాతాలోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి వివరణ తీసుకున్నారు. ముమైత్ అకౌంట్ నుంచి కొన్ని నిధులు ఎఫ్ క్లబ్ కు బదిలీ కావటాన్ని ప్రశ్నించారు. అవన్నీ పార్టీలకు సంబంధించిన లావాదేవీలుగా ఆమె చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరు కావటం తెలిసిందే. ఇక.. మిగిలింది తనీశ్.. తరుణ్ లు మాత్రమే ఉన్నారు. తనీశ్ ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు.

విచారణ సందర్భంగా కెల్విన్.. జీషాన్ అలీలతో తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లావాదేవీలు లేవని ముమైత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీల్లో పరిచయమే తప్పించి.. అంతకు మించి మరెలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లు చెబుతున్నారు. ఈడీ ఏడు గంటల విచారణలో ముమైత్ మరేం చెప్పి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. విచారణకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.