Begin typing your search above and press return to search.

నానికి విలనయ్యాడు.. ఛాన్స్ పట్టేశాడు

By:  Tupaki Desk   |   16 July 2016 1:30 PM GMT
నానికి విలనయ్యాడు.. ఛాన్స్ పట్టేశాడు
X
‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తే వరకు జగపతి బాబు కెరీర్ చాలా డల్లుగా ఉంది. ఆ సినిమా చేయగానే ఆయన రాతే మారిపోయింది. ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర పోషించే వరకు రానా దగ్గుబాటి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అతను సౌత్ ఇండియాలో అత్యంత బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో అతనొకడు. అందుకే కెరీర్ కొంచెం డల్లుగా ఉన్న హీరోలు కొందరు నెగెటివ్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ అయిపోతున్నారు. టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర కూడా ఆ బాటలోనే నడుస్తున్నాడు. నాని కొత్త సినిమాలో అతను విలన్ పాత్ర పోషించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓకే అవ్వగానే నవీన్ చంద్ర కొత్త సినిమాల మీదికి జనాల ఫోకస్ మళ్లింది. ఇంతలోనే అతడికి హీరోగా మరో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది.

కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నవీన్ చంద్ర. ‘బెంగాల్ టైగర్’ ఫేమ్ కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. గత ఏడాది ‘జంప్ జిలాని’ అనే ఫ్లాప్ సినిమా తీశాడు సత్తిబాబు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తనదైన శైలిలో ఓ కామెడీ కథ తయారు చేసుకుని నవీన్ చంద్రతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. నవీన్ ప్రస్తుతం ‘చందమామ రావె’ అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అతడి కెరీర్ కూడా ప్రస్తుతం ఏమంత బాగా లేదు. ఈ మధ్యే వచ్చిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే నాని సినిమాలో విలన్ పాత్రతో తన రాత మారుతుందని ఆశిస్తున్నాడు. ఓ వైపు విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా కంటిన్యూ అవ్వాలని అతను భావిస్తున్నాడు.