Begin typing your search above and press return to search.

ప్రీమియర్లు కూడా రెండు చోట్లా..

By:  Tupaki Desk   |   4 Sept 2015 11:08 AM IST
ప్రీమియర్లు కూడా రెండు చోట్లా..
X
ప్రత్యేక రాష్ట్రం పుణ్యమా అని మన సినిమా వాళ్ళు హైదరాబాద్ లోనే మకాం వెయ్యకుండా ఇతర ప్రాంతాలకు సైతం తరలి వెళ్ళవలిసి వస్తుంది. స్టూడియో లలో కుర్చుని ఇంటర్వ్యూ లివ్వడమేకాక థియేటర్ లకు తరలివెళ్ళి మరీ అభిమానులను సంప్రదించాల్సివస్తుంది. దీనికి హీరోలు కూడా మగ్గుచుపడం శుభసూచకం.

అయితే రెండు రాష్ట్రాల ప్రేక్షకులను సమపాళ్లలో సాటిస్ఫై చెయ్యడానికి చిత్ర బృందం నానా తంటాలు పడుతున్నారు. ఒకచోట ఆడియో రిలీజ్ ఏర్పాటు చేస్తే మరోచోట ప్లాటినం డిస్క్ అని, ఒకచోట సక్సెస్ మీట్ పెడితే మరోచోట థాంక్స్ గివింగ్ పార్టీ అంటూ రకరకాలుగా కష్టపడుతున్నారు. అయితే వీటిని దాటి నిన్న మంచు ఫ్యామిలీ తమ డైనమైట్ సినిమా ప్రీమియర్ ని గ్రాండ్ లెవల్లో ఒకేసారి రెండు రాష్ట్రాలలో ప్రముఖులకు, పాత్రికేయమిత్రులకు ప్రదర్శించడం విశేషం. హైదరాబాద్ ఐమ్యాక్స్ లో విష్ణు ఈ ప్రదర్శనని నిర్వహిస్తే, తిరుపతిలో మోహన్ బాబు ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇలా రెండు ప్రాంతాలలో ప్రిమియర్ ప్రదర్శించిన తొలిచిత్రంగా ఈ సినిమా నిలిచింది. దేవకట్టా తెరకెక్కించిన ఈ చిత్రంలో మంచు విష్ణు మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ ఫీట్లు చేసినట్టు తెలుస్తుంది.