Begin typing your search above and press return to search.

ఆ హీరోకి నెగిటివ్ నచ్చలేదు

By:  Tupaki Desk   |   30 May 2017 6:03 AM GMT
ఆ హీరోకి నెగిటివ్ నచ్చలేదు
X
WWF పోటీల్లో 'ది రాక్'గా ప్రపంచానికి పరిచయం అయిన డ్వేన్ జాన్సన్.. ఆ తర్వాత ఫిలిం యాక్టర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలు చేసిన రాక్.. తాజాగా బేవాచ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సహజంగా ఎప్పుడూ పాజిటివ్ ఎసెన్స్ తో కనిపించడం ఈ యాక్టర్ కు అలవాటు. కానీ బేవాచ్ మూవీ విషయంలో మాత్రం డ్వేన్ ఎందుకో నెగిటివ్ అనే మాటనే తట్టుకోలేకపోతున్నాడు. బేవాచ్ పై ఎన్నేసి హోప్స్ పెట్టుకున్నాడో తెలీదు కానీ.. ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంపై కస్సుబుస్సులాడుతున్నాడు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని డ్వేన్ ను ప్రపంచానికి చూపిస్తున్నాడు. 'ఫ్యాన్స్ కి సినిమా బాగా నచ్చేసింది. కానీ క్రిటిక్స్ మాత్రం ద్వేషిస్తున్నారు. వీరి మధ్య సంబంధం తెగిపోయినట్లుగా కనిపిస్తోంది. జనాలు నవ్వుకునేందుకు సరదాగా గడిపేందుకు మూవీ చూస్తున్నారు' అన్నాడు ఈ 45 ఏళ్ల యాక్టర్.

అక్కడితో ఆగకుండా.. విమర్శకులపై తన ఒపీనియన్ ఓపెన్ గానే చెప్పాడు డ్వేన్. 'క్రిటిక్స్ దగ్గర ఎప్పుడూ విషం.. కత్తులు ఉంటాయా?? కానీ ఫ్యాన్స్ కి మాత్రం సినిమా నచ్చింది. అందరూ పాజిటివ్ గానే చెబుతున్నారు' అంటున్న బేవాచ్ హీరో.. అభిమానులు బేవాచ్ ను తెగ పొగిడేస్తున్న ఓ వీడియోను కూడా చూపిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/