Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ద్వారకతో మళ్లీ దోచుకుంటాడా

By:  Tupaki Desk   |   17 Oct 2016 4:07 AM GMT
ట్రైలర్ టాక్: ద్వారకతో మళ్లీ దోచుకుంటాడా
X
పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ సడెన్ గా మారిపోయింది. ఒక్కసారిగా సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో అయిపోయాడు. అంతకు ముందే ఎవడే సుబ్రమణ్యంతో ప్రూవ్ చేసుకున్న యాక్టర్ కావడంతో.. ఈ కుర్రాడిపై నమ్మకాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడీ హీరో నటించిన ద్వారక అనే మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది.

ట్రైలర్ స్టార్టింగ్ లోనే శ్రీ కృష్ణానంద స్వామి ఆ ద్వారక నుంచి ఈ ద్వారకకు వచ్చారు అంటూ బాబా సినిమా అనే బిల్డప్ ఇచ్చి.. అంతలోనే బీర్ బాటిల్స్ పట్టుకున్న హీరోని చూపించి దొంగబాబా అనే సంగతి చెప్పేశారు. ఇక బాబా గెటప్ లో అల్లరి చిల్లరి వేషాలు.. ఆ గెటప్ ని అడ్డం పెట్టుకుని మోసాలు టైపులో కామెడీ పండించే ఎటెంప్ట్ చేశారు. ఇక బాబా రూపంలోనే ఉంటే హీరోయిన్ పూజా జవేరితో లవ్ స్టోరీ నడిపేసే యాంగిల్ ని కూడా చూపించారు. ఇక హీరో-హీరోయిన్ లకి లిప్ లాక్ కూడా పెట్టించారంటే ఈ కృష్ణానంద స్వామి లీలలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమవుతుంది.

ఆ తర్వాత కాసింత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని టచ్ చేయడం.. పోలీసులు.. రౌడీలు.. మళ్లీ కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యాయి. మొత్తం మీద ప్రామిసింగ్ సంగతేమో కానీ.. ద్వారక ట్రైలర్ ఎంటర్టెయిన్మెంట్ విషయంలో బాగానే మెప్పిస్తుంది. మరి పెళ్లిచూపులతో ఆడియన్స్ మనసుతోపాటు కలెక్షన్స్ కూడా పట్టుకెళ్లిన విజయ్ దేవరకొండ.. ఈసారి ఏ మేరకు దోచుకుంటాడో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/