Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు మోక్షం కలిగింది

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:51 AM GMT
ఆ సినిమాకు మోక్షం కలిగింది
X
చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న సినిమాలకు మోక్షం కలుగుతోంది. ఫిబ్రవరి.. మార్చి నెలలంటే అన్ సీజన్ కాబట్టి విడుదల కోసం ఇబ్బంది పడుతున్న సినిమాల్ని ఈ రెండు నెలల్లో ఎలాగోలా రిలీజ్ చేసేస్తుంటారు. ఆల్రెడీ మంచు లక్ష్మి ‘లక్ష్మీ బాంబు’ ఫిబ్రవరి 24కు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పుడు మూడు నాలుగు నెలలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న ‘ద్వారక’ కూడా రిలీజ్ కు ముహూర్తం చూసుకుంది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్ కు వచ్చిన క్రేజ్ చూసుకుని.. ఆ వేడిలోనే సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేద్దామని చూశారు నిర్మాతలు. కానీ అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడింది. మొదట్లో ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. గత రెండు నెలలుగా ఈ సినిమా వార్తల్లోనే లేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి విడుదల తేదీ ఖరారు చేసుకుంది. విజయ్ దేవర కొండ ఇందులో దొంగ బాబాగా నటించాడు. అతడి సరసన పూజా జవేరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంతో శ్రీనివాస్ రవీంద్ర అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్ ‘ద్వారక’కు సంగీతాన్నందించాడు.