Begin typing your search above and press return to search.

అక్కడ కొత్త సినిమాల పరిస్థితి దారుణం

By:  Tupaki Desk   |   7 March 2017 7:19 AM GMT
అక్కడ కొత్త సినిమాల పరిస్థితి దారుణం
X
గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ఈ వసూళ్లు బోనస్ లాగా మారాయి మన సినిమాలకు. కొన్ని చిన్న సినిమాలు కూడా అక్కడ అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా విడుదలయ్యే ప్రతి సినిమానూ అమెరికాలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రిమియర్ షోలు కూడా వేస్తున్నారు. ఐతే అక్కడి ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలనూ ఆదరించరు. వాళ్ల టేస్టు వేరుగా ఉంటుంది. కొన్ని సినిమాల్ని వాళ్లు గట్టిగా తిప్పికొడుతుంటారు. అలాంటి సినిమాలకు రిలీజ్ ఖర్చులు కూడా రావు. గత వీకెండ్లో రిలీజైన సినిమాల పరిస్థితి అమెరికాలో ఏమంత గొప్పగా లేవు.

మంచు మనోజ్ సినిమా ఫస్ట్ వీకెండ్లో కేవలం 2800 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఆదివారం అయితే ఈ చిత్రం మరీ దారుణంగా 258 డాలర్లు మాత్రమే కలెక్ట్ చేయడం గమనార్హం. విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ ‘పెళ్లిచూపులు’ అమరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిన నేపథ్యంలో అతడి కొత్త సినిమా ‘ద్వారక’కు ఆరంభంలో వసూళ్లు మెరుగ్గానే అనిపించాయి. కానీ తర్వాత ఆ సినిమా కూడా డల్లయింది. ఆదివారం ఈ చిత్రానికి 7200 డాలర్ల వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఇప్పటిదాకా ఈ చిత్రం 48 వేల డాలర్లు వసూలు చేసింది. లాస్ట్ వీకెండ్లో వచ్చిన సినిమాల్లో అన్నిటికంటే బెటర్ టాక్ తెచ్చుకున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మంచి వసూళ్లే సాధిస్తోంది. ఈ చిత్రం ఆదివారం 11 వేల డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. ఆ చిత్రం మొత్తంగా 51 వేల డాలర్లు వసూలు చేసింది. ‘గుంటూరోడు’కు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రావని తేలిపోయింది. దాంతో పోలిస్తే మిగతా సినిమాల పరిస్థితి చాలా మెరుగే కానీ.. ఆ సినిమాలు కూడా పెట్టుబడిని రికవర్ చేయడం కష్టం లాగే కనిపిస్తోంది. వీటి కంటే ముందు వచ్చిన ‘విన్నర్’ లక్ష డాలర్లు వసూలు చేసినప్పటికీ డిజాస్టర్ గానే మిగిలేలా ఉంది. దాని కంటే ముందు వారం వచ్చిన ‘ఘాజీ’ మాత్రం 7.5 లక్షల డాలర్ల మార్కును అందుకుని సూపర్ హిట్ రేంజికి చేరుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/