Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్ బడ్జెట్ మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   18 April 2018 5:15 AM GMT
మల్టీస్టారర్ బడ్జెట్ మామూలుగా లేదుగా
X
టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు కాస్త తక్కువే. అదీ పెద్ద హీరోలు కలిసి సినిమా చేయడమంటే చాలా రేర్ అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రెస్టీజియస్ మల్టీ స్టారర్ తో తెలుగులో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందా అని టాలీవుడ్ అంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తోంది.

రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ కాస్టింగ్ పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ భారీ చిత్రమే. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే ఉంటుందనే టాక్ ముందు నుంచే వినిపించినా ఏ రేంజిలో ఉంటుందనే దానిపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని మూవీ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఈ సినిమా స్టోరీని నాతోపాటు కొంతమంది టెక్నీషియన్లకు రాజమౌళి చెప్పారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయ్యాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ సెట్లు తయారుచేసే పని మొదలుపెట్టేసింది. ఈ సినిమా ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్ గా ఉండబోతోంది’’ అంటూ ప్రొడ్యూసర్ దానయ్య చెప్పుకొచ్చాడు.

ఓ సినిమాకు రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టడం సామాన్యమైన విషయమేం కాదు. కానీ అంతమొత్తం పెట్టడానికి ప్రొడ్యూసర్ రెడీ అంటున్నారంటే అది రాజమౌళి మీద ఉన్న నమ్మకమేని చెప్పక తప్పదు. డి.వి.వి.దానయ్య ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనేనేను సినిమా ప్రొడ్యూస్ చేశారు. మహేష్ తో సినిమా చేయడం అనేది తన కలఅని.. భరత్ అనే నేనుతో అది నెరవేరిందని ఆయన ఆనందంగా చెబుతున్నాడు.