Begin typing your search above and press return to search.

మీడియాని పిల‌వలేదేం దాన‌య్యా?

By:  Tupaki Desk   |   11 Nov 2018 4:52 AM GMT
మీడియాని పిల‌వలేదేం దాన‌య్యా?
X
ఎస్‌.రాజ‌మౌళి- రామారావు-రామ్‌ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ RRR నేటి ఉద‌యం 11 గంట‌ల 11 నిమిషాల‌కు ఘ‌నంగా ప్రారంభ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రారంభోత్స‌వానికి డార్లింగ్ ప్ర‌భాస్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి - న‌ట‌సింహా బాల‌కృష్ణ ప్ర‌త్యేక అతిధులుగా స‌ర్‌ ప్రైజ్ ఇస్తార‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం యంగ్ య‌మ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ లో - మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ లో ఒక‌టే టెన్ష‌న్. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే మ‌రో గ్రేట్ మూవీకి జ‌క్క‌న్న అంకురార్ప‌ణ‌ చేస్తున్నాడు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాడోన‌న్న ఉత్కంఠ నిలువ‌నీయ‌డం లేదు. ఇదే ఎగ్జ‌యిట్‌ మెంట్‌ తో ఏడాదిన్న‌ర కాలంగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. ఆ దివ్య‌మైన ముహూర్తం 11.11.11 అని ప్ర‌క‌టించ‌గానే అభిమానుల్లో ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్ టెన్ష‌న్.

ఆ టెన్ష‌న్‌కి మ‌రి కాసేప‌ట్లోనే తెర ప‌డిపోనుంది. RRR ప్రారంభోత్స‌వం గురించిన ప‌లు అప్‌ డేట్స్ లైవ్‌ లోకి రానున్నాయి. ఇక‌పోతే ఇంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి డివివి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ అధినేత దాన‌య్య మీడియాని ఆహ్వానించ‌క‌పోవ‌డంపై టాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మీడియా అంటే స‌ద‌రు అగ్ర‌నిర్మాత‌లో ఎందుకంత వ్య‌తిరేక‌త‌? ఇలాంటి ముఖ్య‌మైన స‌మ‌యంలో ఎందుకు మీడియాని దూరం పెట్టారు? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆయ‌న స‌క్సెస్‌ ని త‌మ స‌క్సెస్‌ గా భావించి బోలెడంత ప్ర‌మోష‌న్ చేసే మీడియాపై ఆయ‌న చూపించే కృత‌జ్ఞ‌త ఎంత బావుందోనంటూ ఒక‌టే ఇదిగా మాట్లాడుకుంటున్నారు. ఇది కేవ‌లం దాన‌య్య స‌మ‌స్య మాత్ర‌మే కాదు.. మీడియా అంటే ఆ న‌లుగురుకి, అగ్ర నిర్మాత‌ల‌కు ఎందుక‌నో కాస్తంత ఏహ్య భావం ఉంద‌న్న సంకేతాలు ఇప్ప‌టికే ఫిలింమీడియాలోకి వెళ్లిపోయాయి. దీని ప‌ర్య‌వ‌సానం కూడా సంద‌ర్భానుసారం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. అవ‌స‌రం అనుకుంటే ప్ర‌మోష‌న్స్‌ కి వాడుకుని - అవ‌స‌రం లేదు అనుకుంటే విదిలించి కొట్ట‌డం అనే ఫార్ములాని ప‌లువురు అగ్ర‌నిర్మాత‌లు ప్ర‌తిసారీ అప్లయ్ చేస్తూ త‌మంత‌ట తామే బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు.

నేడు మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ భారీ లాంచింగ్ అంటూ డీవీవీ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ త‌న అధికారిక సామాజిక మాధ్య‌మాల్లో ఊద‌ర‌గొట్టేస్తోంది. త‌న సినిమాల ప్ర‌చారానికి త‌న సొంత‌ మీడియా చాలు అనే వైఖ‌రి దాన‌య్య కు ఉంది. అయితే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న ఇలాంటి ప్రాజెక్టు ప్రారంబోత్సవం వేళ ఉద్ధేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న మీడియాని దూరం పెట్ట‌డంపై టాలీవుడ్ మీడియా కాస్తంత గ‌రంగ‌రంగానే ఉంద‌న్న చ‌ర్చా సాగుతోంది.