Begin typing your search above and press return to search.

దువ్వాడ రూట్లో నాలుగో రౌండ్ స్టార్ట్

By:  Tupaki Desk   |   4 Jan 2017 4:55 PM GMT
దువ్వాడ రూట్లో నాలుగో రౌండ్ స్టార్ట్
X
సరైనోడు చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. దాదాపు ఆరు నెలలు గ్యాప్ తీసుకుని కొత్త మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాధం అనే టైటిల్ పై తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీలో బన్నీ రెండు పాత్రలు పోషిస్తున్నాడనే ప్రచారం ఉంది.

డీజే మూవీకి ఓ నెల్లాళ్ల క్రితం బన్నీ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. తనకు రెండో సంతానంగా కూతురు ఆరా పుట్టడంతో.. మూవీ షూటింగ్ కి బ్రేక్ వేసిన బన్నీ.. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేశాడు. దువ్వాడ జగన్నాధం నాలుగో షెడ్యూల్ షూటింగ్ హైద్రాబాద్ లో ప్రారంభమైపోయింది. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలతో పాటు కొన్ని ఫైట్స్ కూడా పిక్చరైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్ పోషిస్తున్న విలన్ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న దువ్వాడ జగన్నాధంకు దిల్ రాజు నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/