Begin typing your search above and press return to search.

#TRENDS సెల‌బ్రిటీల విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు

By:  Tupaki Desk   |   26 Oct 2020 10:15 AM IST
#TRENDS సెల‌బ్రిటీల విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు
X
దసరా సందర్భంగా సినీ స్టార్ ‌లు..., సామాన్య‌ ప్రజలు తమ శుభాకాంక్షలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. `అర్జున్ ‌రెడ్డి` మూవీ నుంచి సూప‌ర్‌‌ స్టార్ మ‌హేష్‌ బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. త‌న‌కు ఏది అనిపిస్తే అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు. లాక్‌ ‌డౌన్ స‌మ‌యంలో టాలీవుడ్ నుంచి అత్య‌ధికంగా స్పందించి ట్వీట్ లు చేసిన హీరో ఎవ‌రైనా వున్నారంటే అది మ‌హేష్‌బాబు మాత్ర‌మే.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మ‌హేష్ ప్ర‌త్యేకంగా స్పందించ‌డం ఆస‌క్తిక‌లిగిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్ర‌ధాన భాష‌ల్లో ఆయ‌న అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. తెలుగు,.. త‌మిళ‌.., క‌న్న‌డ,.. మ‌ల‌యాళ..‌, హిందీ భాష‌ల్లో ఫ్యాన్స్ ‌కి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. అదే విధంగా హ్యాండ్స‌మ్‌ గా వున్న త‌న ఫొటోని కూడా పంచుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది.

మ‌హేష్‌ తో పాటు రాశిఖ‌న్నా కూడా ప్ర‌త్యేకంగా స్పందించింది. లార్డ్ రామ్ విల్లె ఎక్కుపెట్టిన స్టిల్‌ని పంచుకున్న రాశిఖ‌న్నా తన కోరికను అభిమానులతో పాటు నెటిజ‌న్‌ల‌తో పంచుకున్నారు. `లోపల శత్రువులు లేనప్పుడు, .. బయట ఉన్న శత్రువులు మిమ్మల్ని బాధించలేరు. మీలోవున్న రావ‌ణుడిని కాల్చేయండి మీ అందరికీ హ్యాపీదస్రా ` అని ట్వీట్ చేసింది.

మెహ్రీన్ పిర్జాదా సంప్ర‌దాయ‌ దుస్తులలో ఉన్న తన ఫోటోను పంచుకున్నారు. విజయదశమి అందరికీ శుభాకాంక్షలు. చీకటిపై కాంతి విజయం సాధించగలదు, చెడుపై మంచి గెలుస్తుంది. అధ‌ర్మంపై ధర్మం గెలుస్తుంది. హ్యాపీ దసరా ` అని ట్వీట్ చేసింది. త్వరలో వధువు కాబోతున్న కాజల్ అగర్వాల్ విల్లుని ఎక్కుపెట్టిన రాముడి ఫోటోను పంచుకుంది. ఆ ఫొటోలో ల‌వ్ సింబ‌ల్ క‌నిపించేలా ట్వీట్ చేసింది. ఇలా టాలీవుడ్ స్టార్లు ఈ ద‌స‌రాకు త‌మ స్టైల్లో అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.