Begin typing your search above and press return to search.

గెట్‌ రెడీ ఫర్‌ వార్‌ - హారర్‌ - లవ్‌

By:  Tupaki Desk   |   21 Oct 2015 6:22 PM GMT
గెట్‌ రెడీ ఫర్‌ వార్‌ - హారర్‌ - లవ్‌
X
దసరా సీజన్ అంటే సినిమాలకు భలే పండుగ. అందుకే అక్టోబర్ 22న విజయదశమి నాడు వరుసగా సినిమాలు క్యూ కట్టేశాయి. ఈ రోజున మూడు మూవీస్ థియేటర్లలోకి వస్తుండగా.. ఒక్కోటి ఒక్కో జోనర్ లోది కావడం విశేషం.

మొదటగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న కంచె గురించే. సెకండ్ వాల్డ్ వార్ థీమ్ తో లవ్ స్టోరీని మిక్స్ చేసి తీసిన మూవీ ఇది. ఈ సినిమాకి స్పెషల్ విజువల్స్. 70 ఏళ్ల క్రితంలోకి మనల్ని తీసుకెళ్లేందుకు కంచె టీం బాగానే కష్టపడింది.

పండుగనాడు వస్తున్న మరో సినిమా... సుమంత్ అశ్విన్ నటించిన కొలంబస్. ఇది పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసి చిత్రీకరించిన లవ్ ఎంటర్ టెయినర్. ఓ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీతో.. యువతను ఆకట్టుకుంటామని ధీమాగా ఉంది యూనిట్.

దసరానాడు థియేటర్లలో పండుగ చేసుకోనున్న మరో మూవీ రాజుగారి గది. హారర్ కామెడీ జోనర్ లో దీన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ ఓంకార్. ట్రైలర్ తోపాటు ఓంకార్ స్టైల్ పబ్లిసిటీ గిమ్మిక్కులతో.. ఇప్పటికే రాజుగారి గదికి మంచి హైప్ వచ్చింది.

కంచె - రాజుగారి గది - కొలంబస్.. ఈమూడు చిత్రాలు మూడు జోనర్లలోనివి కాగా.. వీటితోపాటు పండుగనాడు థియేటర్లలో కనిపించనున్న సినిమాలు బ్రూస్ లీ, రుద్రమదేవి. బ్రూస్ లీ మాస్ ఎంటర్టెయినర్ కాగా.. రుద్రమదేవి చారిత్రాత్మక చిత్రం. అంటే.. ఈసారి థియేటర్లలో ఉండే సినిమాలన్నీ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లవే అన్నమాట.