Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని ఏలుతున్న డస్కీ బ్యూటీస్..!

By:  Tupaki Desk   |   28 April 2021 11:30 PM GMT
ఇండస్ట్రీని ఏలుతున్న డస్కీ బ్యూటీస్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పాతనీరు పోతూ కొత్తనీరు వస్తూనే ఉంది. మొన్నటివరకు స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వారంతా ఇప్పుడు ఓవైపు పెళ్లిళ్లు చేసుకుంటూ సినిమాలకు బ్రేక్ చెబుతుంటే మరికొందరు పెళ్లి కంటే సినిమాలే ముఖ్యమని హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అనుకుంటున్న వారంతా గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఇన్నేళ్లు ఆకట్టుకున్నవారే. కానీ సినిమా టెక్నాలజీ, సినిమా కథాకథనాలు మారుతున్నా కొద్దీ ప్రేక్షకుల అభిరుచులలో కూడా మార్పులు వస్తుంటాయి. ఆ విధంగానే ఇంతవరకు హీరోయిన్స్ ఖచ్చితంగా తెల్లని మేనిఛాయతో పాటు అదిరిపోయే శరీరాకృతి కూడా ఉండాలని భావించేవారు.

కానీ ఇప్పుడు రోజురోజుకి అభిరుచులు మారుతూ వస్తున్నాయి. అందుకే తెల్లతోలు హీరోయిన్స్ కంటే కూడా డార్క్ అండ్ డస్కీ బ్యూటీస్ ప్రస్తుతం ప్రేక్షకులను వలలో వేసుకుంటున్నారు. తెల్లతోలు పాపల కంటే డస్కీ బ్యూటీస్ మాత్రమే ఇష్టమంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ లో ప్రస్తుతం నివేత పేతురాజ్, ఈషారెబ్బా, ఐశ్వర్యరాజేష్, డింపుల్ హయాతి, పూజాహెగ్డే.. ఈ లిస్టులో ఉన్నారు. అంటే ఇంకా ఉన్నారు కానీ ప్రస్తుతానికి వీరే జనాలకు బాగా తెలుసు. ఇందులో పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఇప్పటికే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. అయితే వీరంతా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఫ్యూచర్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే డస్కీ బ్యూటీస్ వీరే అంటూ టాక్. చూడాలి మరి పూజా కాకుండా ఇంకెవరు స్టార్డం అందుకుంటారో..!