Begin typing your search above and press return to search.
పండుగ వేళ.. నమ్రత పోస్టు ఎందుకంత వైరల్?
By: Tupaki Desk | 15 Nov 2020 2:20 PM ISTదీపావళి పండుగ వేళ.. మహేశ్ బాబు సతీమణి నమ్రత పోస్టు చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందరి మనసుల్ని ఆకట్టుకుంటున్న ఈ పోస్టు ప్రత్యేకత ఏమంటే.. ఒక అమ్మాయి తన చిన్నారిని ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేయటంతోపాటు.. ఆ వివరాల్ని షేర్ చేశారు.
ఒక చిన్న బాబుకు హార్ట్ సర్జరీకి అవసరమైన సాయాన్ని మహేశ్ బాబు అందించటం.. ఆ సర్జరీ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో జరిగింది. ‘మై దీపావళి బ్లెస్సింగ్స్’ అంటూ.. సదరు చిన్నారి ఆరోగ్యం ఇప్పుడు బాగుందని చెప్పారు. చిన్నారితో పాటు.. వారి కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబీఫర్ సేవింగ్స్ హార్ట్ అన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా సాయం కోసం తమను ఆర్థించే వారికి చేయాల్సినంత సాయం చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. పండుగ పూట మిగిలిన వారికి భిన్నంగా తన ఇన్ స్టాలో నమ్రత చేసిన పోస్టు అందరి అభినందనల్ని అందుకుంటోంది.