Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న టిక్ టాక్ స్టార్..!!

By:  Tupaki Desk   |   31 Dec 2020 12:01 PM GMT
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న టిక్ టాక్ స్టార్..!!
X
ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఫేమస్ అవ్వడానికి గొప్ప ప్లాట్ ఫామ్. ఎలాంటి కష్టం లేకుండా డైరెక్ట్ సెలబ్రిటీలను చేసేస్తోంది. ఇంతకుముందులా సినిమా ఛాన్సుల కోసం ఆఫీసుల ముందు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియానే నేరుగా అవకాశం కల్పిస్తుంది. అలా సినిమా స్టార్స్ అవుతున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. మొన్నటి వరకు టిక్ టాక్ అనే మాధ్యమం ద్వారా ఎంతోమంది సామాన్యులు వారి ప్రతిభని బయట పెట్టి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేసారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లు కామెడీ షోలలో కూడా రాణిస్తున్నారు. తాజాగా ఒక టిక్ టాక్ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసాడట. అది కూడా చిన్న సినిమాలో కాదు మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో అంటే మాటలు కాదు.

టిక్ టాక్ స్టార్ దుర్గారావు అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికి తెలుసు. తన కామెడీ యాక్టింగ్, డాన్స్, వీడియోలతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే అలా టిక్ టాక్ ద్వారా నేడు జబర్దస్త్ షోలో.. అలాగే సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా క్రాక్. ఈ సినిమాతో దుర్గారావు సినీ ఇండస్ట్రీలో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోనున్నాడు. మరి దుర్గారావుకు అవకాశం ఎలా వచ్చింది అంటే.. డైరెక్టర్ గోపీచంద్ దుర్గారావు టిక్ టాక్ వీడియోస్, జబర్దస్త్ వీడియోలు చూసి పిలిచి.. అతనితో ఓ మంచి కామిక్ పాత్ర చేయించినట్లు సమాచారం. ఈ సంక్రాంతికి క్రాక్ మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. చూడాలి మరి దుర్గారావు అదృష్టం ఎలా ఉందో..!!