Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: `మూగ`నోము ఏల అందాల బాలా?
By: Tupaki Desk | 14 Dec 2020 11:32 AM ISTటాలీవుడ్ నటీమణుల్లో ప్రయోగాత్మకత అంతకంతకు పెరుగుతోందా? క్లాసిక్ డేస్ నటీమణుల్లా తమని తాము నిరూపించుకోవాలన్న పంతంతో ఉన్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. సావిత్రి.. భానుమతి.. శ్రీదేవి .. భానుప్రియలా తమకు కూడా ఐడెంటిటీ కావాలని అనుకుంటున్నారు. రొటీన్ గ్లామరస్ పాత్రల కంటే వైవిధ్యమైన నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక ఇటీవల మూగ బదిర (మ్యూట్) పాత్రలపై మన కథానాయికలు మనసు పారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ అగ్ర నాయికలు ఇటీవల ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా మ్యూట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. టాలీవుడ్ లో తాజా ధోరణి ఆశ్చర్యపరుస్తోంది. వీరంతా వికలాంగుల పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక.. పురస్కారాలను కొట్టేయాలన్న తపన కూడా మన భామల్లో పెరిగింది. అందుకే అలాంటి పాత్రల కోసం చూస్తున్నారు.
ఇటీవల విడుదలైన `నిశ్శబ్ధం`లో అనుష్క మూగ యువతిగా నటించింది. ఆమె ఈ చిత్రంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన నటనకు చక్కని పేరొచ్చింది. సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ కూడా అదే చేస్తున్నారు. `గమనం` అనే ఆంథాలజీ చిత్రంలో శ్రియా మూగ విలేజీ అమ్మాయిగా నటిస్తోంది. సుజన రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది.
తాజా సమాచారం ప్రకారం అక్కినేని కోడలు సమంత కూడా మూగ అమ్మాయి పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించబోయే హర్రర్ చిత్రంలో సమంత అక్కినేని మ్యూట్ గర్ల్ గా కనిపించనుంది. సామ్ ఇంతకుముందు ఓ బేబి చిత్రంలో వృద్ధురాలి పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఓ బేబిలో తన నటనకు గొప్ప పేరొచ్చింది. మరోసారి మూగ యువతిగా ప్రయోగాత్మక పాత్రలో నటించి మెప్పించేందుకు తపిస్తున్నారట.