Begin typing your search above and press return to search.
స్టార్ హీరో బర్త్ డే స్పెషల్ గా 'కురుప్' టీజర్ విడుదల...!
By: Tupaki Desk | 28 July 2020 3:20 PM ISTమలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టారు దుల్కర్ సల్మాన్. అనతికాలంలోనే ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక తెలుగులో నటించింది 'మహానటి' ఒక్కటే అయినప్పటికీ డబ్బింగ్ సినిమాలతో మన ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''కురుప్'' టీజర్ రిలీజ్ చేసారు.
1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు మాస్టర్ ఎంటెర్టైమెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంచి ఆదరణ తెచ్చుకోగా ఇప్పుడు దుల్కర్ బర్త్ డే స్పెషల్ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా దుల్కర్ తెలుగులో రెండో స్ట్రెయిట్ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో ''యుద్ధంతో రాసిన ప్రేమకథ'' అనే చిత్రం చేయనున్నాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా 'లెఫ్టినెంట్' రామ్ 'యుద్ధంతో' రాసిన ప్రేమకథ.. అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం తమిళ్ లో కూడా విడుదల చేయనున్నారు. దీనితో పాటు 'వాన్' 'హే సినామిక' అనే మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్.