Begin typing your search above and press return to search.

సంక్రాంతి బ‌రిలో చేరిన బంగారం

By:  Tupaki Desk   |   4 Jan 2022 4:33 AM GMT
సంక్రాంతి బ‌రిలో చేరిన బంగారం
X

RRR సంక్రాంతి బ‌రి నుంచి వైదొల‌గ‌డం అనూహ్యం. రాధేశ్యామ్ రిలీజ్ పైనా సందేహాలున్నాయి. ఇలాంటి సంద‌ర్భం అరుదైన‌ది. అందుకే ఇప్పుడు ఎన్న‌డూ లేనంత‌గా చిన్న సినిమాల‌న్నీ సంక్రాంతి రేసింగ్ కి క్యూక‌ట్టాయి. ఈసారి రేసులో ఇద్ద‌రు డెబ్యూ హీరోల సినిమాల‌తో పాటు నాలుగైదు ఇత‌ర సినిమాలు ఉన్నాయి. వరుసగా చిన్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. చిన్న చిన్న తెలుగు చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటిస్తున్నారు.

దీన్ని అవకాశంగా తీసుకుని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమా `సెల్యూట్` ను ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా విడుదల కానుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ పోలీసుగా కనిపించనున్నాడు.

దుల్కార్ ప్ర‌స్తుతం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనిపై దుల్కార్ ఇటీవ‌ల ఓ స‌మావేశంలో మాట్లాడుతూ..``నేను హను రాఘవపూడి దర్శకత్వంలో నా రెండవ తెలుగు చిత్రాన్ని పూర్తి చేస్తున్నాను. దీనిని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అది కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది`` అని అన్నారు. దుల్క‌ర్ న‌టిస్తున్న‌ కింగ్ ఆఫ్ కోథా- ఓతిరమ్ కడకం- హే సినామిక రిలీజ్ కి రావాల్సి ఉంది. ఒకే బంగారం- మ‌హాన‌టి లాంటి చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్న దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.