Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మంచు కొండల్లో లెఫ్టినెంట్ రామ్‌ రిలాక్స్‌

By:  Tupaki Desk   |   7 Dec 2021 3:30 AM GMT
పిక్ టాక్ : మంచు కొండల్లో లెఫ్టినెంట్ రామ్‌ రిలాక్స్‌
X
మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈయన హీరోగా ఇటీవల కురూప్ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళం మరియు ఇతర సౌత్ భాషల్లో భారీ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా అన్ని విధాలుగా మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈయన లెఫ్టినెంట్‌ రామ్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా మన వైజయంతి మూవీస్ బ్యానర్‌ వారు మన హను రాఘవపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు లో రూపొందుతున్న లెఫ్టినెంట్‌ రామ్‌ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో హడావుడి కనిపిస్తోంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో యుద్ద సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. యుద్దంలో ఒక మంచి ఫీల్ గుడ్‌ లవ్‌ స్టోరీని దర్శకుడు హను రాఘవపూడి చూపించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ కు జోడీగా మృనాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్‌ సీతలుగా దుల్కర్ మరియు మృనాల్ ల మద్య సాగే ప్రేమ కథ ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథగా ట్రెండ్‌ సెట్‌ చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ లో షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. మంచు కొండల మద్య ఆర్మీ బేస్ క్యాంప్ లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ కు సంబంధించిన స్టిల్స్ బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే దుల్కర్ ఈ స్టిల్ ను తన ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మంచు కొండల్లో నిజమైన ఆర్మీ బేస్ క్యాంప్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం అందుతోంది. దుల్కర్ సల్మాన్ తన విభిన్నమైన నటన మరియు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటాడని అభిమానులు ఆశపడుతున్నారు. తెలుగు తో పాటు సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా ను వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సగం సక్సెస్ అయినట్లే ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.