Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న దుల్క‌ర్ స‌ల్మాన్

By:  Tupaki Desk   |   19 Jan 2021 1:00 PM IST
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న దుల్క‌ర్ స‌ల్మాన్
X
‘దుల్కర్ సల్మాన్..’ ప్రముఖ మలయాళీ స్టార్ మమ్ముట్టి కుమారుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ.. తనదైన యాక్టింగ్ తో సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ గా ఎదిగాడు. అయితే.. ఇప్పటి వరకూ సౌత్ లోనే సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు బీటౌన్ ను టార్గెట్ చేశాడు. త్వరలో ఓ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న దుల్కర్.. జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు.

విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బాల్కి.. దుల్కర్ ను బీటౌన్ కు ఇంట్రుడ్యూస్ చేయబోతున్నాడు. పా, ప్యాడ్ మ్యాన్, షమితాబ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన బాల్కి.. అందరి నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలో ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించబోతున్నారు.

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నాడు. అందుతున్న అప్డేట్ ప్రకారం.. ప్రేక్షకులు సీటుకు అతుక్కుపోయే థ్రిల్లర్ సబ్జెక్ట్ తో బాల్కీ రాబోతున్నాడని సమాచారం. ఈ చిత్రం కోసం ఎనర్జిటిక్ హీరోకోసం సెర్చ్ చేస్తున్న ఈ ఏస్ ఫిల్మ్ మేకర్.. మోలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట.

ఇక, ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఏమంటే.. దర్శకుడే నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. బాల్కీ స్వయంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. మరి, హీరోయిన్.. ఇతర పాత్రలు.. టెక్నీషియన్ల వివరాల గురించి తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.