Begin typing your search above and press return to search.

అఖిల్ మల్టీస్టారర్ చేస్తున్నాడా!?

By:  Tupaki Desk   |   27 March 2018 7:57 AM GMT
అఖిల్ మల్టీస్టారర్ చేస్తున్నాడా!?
X
అక్కినేని అఖిల్ హీరోగా ముచ్చటగా మూడో సినిమా మొదలైంది. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు ముహూర్తం షాట్ వంటివి కూడా పూర్తి చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా.. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు మలయాళ హీరో రావడంతో అనేక రూమర్స్ బయలుదేరాయి.

అఖిల్ మూడవ సినిమా పూజ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నాడు. కార్యక్రమం ఆసాంతం అక్కడే ఉన్నాడు దుల్కర్. దీంతో ఈ సినిమాలో ఈ మలయాళ హీరో కూడా నటిస్తున్నాడనే టాక్ బయలుదేరింది. ఇది మల్టీస్టారర్ కూడా అయి ఉంటుందని ఓ టాక్ బయల్దేరింది కానీ.. ప్రస్తుతం అఖిల్ తో ప్రయోగాలు చేయించేందుకు నాగ్ ఒప్పుకోకపోవచ్చని అంటున్నారు. కాకపోతే ఈ కొత్త సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండొచ్చని.. మల్టీస్టారర్ కాకపోయినా.. మూవీకి కీలకమైన ఓ గెస్ట్ రోల్ లో కనిపించవచ్చని కొందరు చెబుతున్నారు.

కానీ అఖిల్ అండ్ దుల్కర్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందట. ఇద్దరూ థిక్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారట. ప్రస్తుతం మహానటి మూవీ కోసం డబ్బింగ్ చెబుతున్న దుల్కర్ సల్మాన్ హైద్రాబాద్ లోనే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. అఖిల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ ను బేస్ చేసుకుని.. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాడని.. అంతే తప్ప అఖిల్ మూడో సినిమాలో దుల్కర్ నటించే ఛాన్స్ లేదని ఓ టాక్ వినిపిస్తోంది.