Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్‌ గా 'భారతీయుడు 2'?

By:  Tupaki Desk   |   14 Nov 2018 9:26 AM GMT
మల్టీస్టారర్‌ గా భారతీయుడు 2?
X
సౌత్‌ ఇండియా దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ చిత్రంను హాలీవుడ్‌ రేంజ్‌ లో తెరకెక్కించిన శంకర్‌ తదుపరి చిత్రం విషయంలో కూడా అప్పుడే ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు. 90 ల్లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కమల్‌ హాసన్‌ తో శంకర్‌ తీస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం మల్టీస్టారర్‌ అంటూ సమాచారం అందుతోంది.

కమల్‌ హాసన్‌ తో పాటు ‘భారతీయుడు 2’ చిత్రంలో మరో ఇద్దరు యువ హీరోలు కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో శింబును కూడా కీలక పాత్రకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు నుండి కూడా ఒక స్టార్‌ నటుడిని ఈ చిత్రంలో ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలోనే ఆ విషయంపై కూడా శంకర్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

‘భారతీయుడు’ తరహాలో ఈ రెండవ పార్ట్‌ కూడా అవినీతి వ్యతిరేక పోరాటం నేపథ్యంలోనే కథ ఉంటుందని సమాచారం అందుతుంది. శింబు ఈ చిత్రంలో విలన్‌ గా కనిపించే అవకాశం ఉందని తమిళ వర్గాల నుండి అప్‌ డేట్‌ వస్తుంది. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కమల్‌ తో పాటు దుల్కర్‌ సల్మాన్‌, శింబులు ఈ సినిమాలో ఉంటే సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. త్వరలో రెగ్యుర్‌ షూటింగ్‌ ను ప్రారంభించేందుకు శంకర్‌ ఏర్పాట్లు చకచక చేస్తూనే ఉన్నాడు.