Begin typing your search above and press return to search.

తండ్రవుతున్న మల్లూ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   4 April 2017 5:26 PM GMT
తండ్రవుతున్న మల్లూ సూపర్ స్టార్
X
అతి తక్కువ టైంలోనే మలయాళంలో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో దుల్కర్ సల్మాన్. కేరళలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ హీరో.. ఓకే బంగారం మూవీతో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. దక్షిణాదిన సూపర్బ్ ఇమేజ్ సంపాదించేసుకున్నాడు. మణిరత్నం సినిమా కావడంతో.. దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాడు.

దుల్కర్ సల్మాన్ త్వరలో తండ్రి అవుతున్నాడనే న్యూస్ మల్లూవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. మలయాళీ పేపర్లు.. ఛానల్స్.. మొత్తం మీడియా అంతా జూనియర్ దుల్కర్ వస్తున్నాడంటూ వార్తలు వండి వడ్డించేస్తోంది. జస్ట్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఈ సూపర్ స్టార్.. 24 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేసుకున్నాడు. 2011 డిసెంబర్ 22న దుల్కర్ సల్మాన్-అమల్ సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోగా.. ఇప్పుడు దుల్కర్ భార్య అమల్.. నిండు నెలల గర్భిణి అని తెలుస్తోంది. ఇప్పటివరకూ దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. మే నెలాఖరులో కానీ.. జూన్ తొలి వారంలో కానీ జూనియర్ దుల్కర్ సల్మాన్ పుట్టనున్నాడని అంటున్నారు.

అటు స్టార్ ఇమేజ్ తో పాటు.. రీసెంట్ గా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా చార్లీ చిత్రానికి అవార్డ్ అందుకున్న దుల్కర్ కి.. ఇప్పుడు కెరీర్ లోనే కాదు.. పర్సనల్ గా కూడా బెస్ట్ టైం నడుస్తున్నట్లుగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/