Begin typing your search above and press return to search.

మహానటి ప్రియుడు మొగుడు ఇతడే

By:  Tupaki Desk   |   29 July 2017 4:54 AM GMT
మహానటి ప్రియుడు మొగుడు ఇతడే
X
మహానటి సావిత్రి జీవితంలో ఆవిడ అధిరోహించిన నట శిఖరాలు చాలా ఉన్నట్లే.. ఆమె పర్సనల్ లైఫ్‌ లో కూడా ఎన్నో ఇక్కట్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆమె అప్పటికే పెళ్ళయిన తమిళ సూపర్ స్టార్ జెమిని గణేశన్ తో జరిపిన రొమాన్స్.. అలాగే అతనితో సీక్రెట్ పెళ్ళి.. ఆ తరువాత ఇబ్బందులు.. ఇలా చాలానే ఉన్నాయి. అందుకే ఈ పాత్రను పోషించడానికి చాలామంది తమిళ స్టార్ హీరోలు ఇంట్రెస్టెంట్ చూపలేదు. ఎందుకంటే ఆ జెమిన్ గణేశన్ పాత్రలో నెగెటివ్ కోణం చూపకుండా సావిత్రి బయోపిక్ తీయడం కష్టమే.

అయితే సావిత్రి జీవితాన్ని ''మహానటి'' పేరుతో తెరకెక్కిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. చివరకు మలయాళ నటుడు డల్కర్ సల్మాన్ ను ఈ పాత్రకు తీసుకున్నాడు. ఓకె బంగారం సినిమాతో పాపులర్ అయిన డల్కర్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు అనే సందేహాలకు తెరదించుతూ.. డల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలోని అతడి లుక్ ను రివీల్ చేసింది మహానటి టీమ్. ఈ పోస్టర్ లో చూస్తుంటే డల్కర్ అచ్చం గణేశన్ తరహాలోనే ఉన్నాడు. అప్పట్లో కింగ్ ఆఫ్‌ రొమాన్స్ అని పేరొందిన ఈ సూపర్ స్టార్ పాత్రలో ఒదిగిపోయాడంతే.

ఈ సినిమాలో ఆల్రెడీ కీర్తి సురేష్‌ లుక్ కూడా ఎలా ఉండబోతుందో లీక్ అయిపోయింది. చూస్తుంటే రియాల్టీకి చాలా దగ్గరగా ఉండేలా ఇప్పుడు ''మహానటి'' సినిమాలో దాదాపు అందరి పాత్రలనూ తీర్చిదిద్ధినట్లున్నారు. మరి ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ అనే పాత్రలు ఎలా ఉండబోతున్నాయో మనం చూడాలి. అల్లుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాను మామ అశ్విని దత్ నిర్మిస్తున్నారు.